ఎన్నికల ముందు సీఎం జగన్‌కు ఓ తలనొప్పి వదిలింది. ఎట్టకేలకు ప్రభుత్వంతో అంగన్వాడీలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సమ్మె విరమిస్తూ అంగన్వాడీలు నిర్ణయం తీసుకున్నారు.  వేతనాలను జూలైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అందుకే సమ్మె విరమిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ తెలిపారు.


చర్చల్లో జరిగిన అంశాలను రాతపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారని.. గ్రాట్యుటీ అంశాన్ని కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని.. వర్కర్ కు 1.2 లక్షలు ఇచ్చేందుకు, హెల్పర్ కు 60 వేలు ఇచ్చేందుకు అంగీకరించారని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ వివరించారు. మట్టిఖర్చులకు 20 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని..పరిహారంగా 2 లక్షలు ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలిపారని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ అన్నారు.


టీఏ బిల్లులు కేంద్రం కూడా పెండింగ్ లో ఉంచిందని.. నెలకు ఓ టీఏ బిల్లు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ వివరించారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందువల్లే సంక్షేమపథకాలు అమలు చేయటం లేదన్న ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ.. 42 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.


అలాగే కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ వివరించారు. అందుకే సమ్మెను కాల్ ఆఫ్ చేసి విధులకు హాజరు అవుతామని ఏపీ అంగన్వాడీ వర్కర్ ల యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ వివరించారు. దీంతో కొన్ని రోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా ఉన్న అంగన్వాడీల వివాదం ముగిసినట్టయింది. ఎన్నికల ముందు సాధ్యమైనంత వరకూ అన్ని వర్గాలనూ కలుపుకుపోవడం ఏ అధికార పార్టీకయినా ముఖ్యమైన విషయమే. ఇప్పుడు అంగన్వాడీల సమ్మె విరమణ ద్వారా వైసీపీ కాస్త ఊపిరిపీల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: