ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ వ్యూహ కర్తగా.. ఎన్నికల స్ర్టాటజిస్టుగా సేవలు అందించిన ఆయన తాజాగా ప్రముఖ మీడియా సంస్థ పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పే అంచనాలకు లాజిక్కులతో పాటు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు.


400 సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ బృందం ఎంత మేర ఆశలు నెరవేరతాయో అనే దానితో పాటు పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం అయ్యే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 300 లకు సీట్లను పైగా సాధిస్తుంది. ఆ పార్టీ పెట్టుకున్న 370 సీట్ల లక్ష్యాన్ని సాధించకపోవచ్చు.  బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు విపక్షాలకు గతంలో పలు అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకోలేదు.


దేశంలో 543 ఎంపీ స్థానాలకు తూర్పు, దక్షిణాది రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో 204 సీట్లు ఉన్నాయి. వీటిలో 2014లో బీజేపీ గెలుచుకున్న సీట్లు 29. 2019లో 47. కానీ ఈ సారి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తన సీట్లను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ ఓటు షేర్ రెండెంకలకు చేరుతుంది.


మోదీ, అమిత్ షా లాంటి అగ్ర నాయకులు తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో తరచూ పర్యటిస్తున్నారు. దీంతో వారు అక్కడ తమ ప్రాభల్యాన్ని పెంచుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ బీజేపీ బలంగా పుంజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా ఓట్లు, సీట్లు సాధిస్తుంది. ఇక్కడ ఆ పార్టీ మొదటి, లేదా రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ సాధించే సీట్లు, ఓట్లు అధికంగా ఉంటాయి. ఇది చాలా పెద్ద విషయం అంటూ కాషాయ పార్టీకి బూస్ట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: