
మరి అంత ప్రేమగా చూసుకున్న వైసీపీపై ఆమెకు పార్టీ అధికారం పోయిన తర్వాత.. ప్రేమ విరిగిపోయిం ది. ఈ క్రమంలోనే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. ఆరు మాసాల కిందటే ఆమె రాజీనామాకు రెడీ అయ్యారు. నంద్యాలకు చెందిన ఆమెకు.. మంత్రి ఫరూక్‌తోనూ రాజకీయ సత్సం బంధాలు ఉన్నాయని అంటారు. ఆయన ద్వారానే.. నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కూడా కలుసుకున్నారు. ఇంకేముంది సైకిల్ ఎక్కేస్తున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది.
కానీ.. ఆరు మాసాలు గడిచినా పార్టీ నుంచి ఆమెకు ఎలాంటి పిలుపు రాలేదు. పైగా.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరిపోయారు. తాజాగా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మయానా జకీయా ఖానమ్ బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి తో భేటీ అయ్యారు. పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి జకియాను ఆహ్వానించారు.
రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ , కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి తదితరుల సమక్షంలోనే జకీయా పార్టీ లో చేరారు. మరి టీడీపీ ఆమెను ఎందుకు చేర్చుకోలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా.. ప్రస్తుతం నంద్యాల లో నెలకొన్న రాజకీయాలే దీనికి కారణమని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు