ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఇష్యూ టీడీపీలో ముదిరి పాకాన ప‌డుతోంది. మ‌రింత ర‌చ్చ‌గా మారుతోంది. కొలిక‌పూడి ప్ర‌తి చిన్న విష‌యాన్ని పెద్ద‌ది చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు అంద‌రిలోనూ బాగా కాంట్ర‌వ‌ర్సీ ఎమ్మెల్యే అయిపోయారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఒక‌టి రెండుసార్లు చెప్పి చూసినా ఆయ‌న తీరులో మార్పు రాలేదు. ఇక కొలిక‌పూడిని కంట్రోల్ చేసేందుకు సీనియ‌ర్ల‌తో ఒక‌టి రెండుసార్లు క‌మిటీ వేసి, క్ర‌మ‌శిక్ష‌ణతో ఉండాల‌ని చెప్పించి చూసినా ఆయన మార‌డం లేదు.


అయితే కొలిక‌పూడిని టిడిపిలోనే ఉండే ఓ అదృశ్య శక్తి నడిపిస్తుందని టాక్ బయటకు వచ్చింది. అతడి అండదండలతోనే విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని ఎదుర్కొంటున్నాడని అంటున్నారు. అందుకే చిన్ని నుంచి ఎదురు అవుతున్న ప్రతి ఇబ్బందిని టిడిపిలోని ఆ ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు కొలిక్కిపడి సీక్రెట్గా చెవిలో ఊదుతున్నారట. కోస్తా జిల్లాలకు చెందిన ఆ కీలక డైనమిక్ లీడర్ గా టిడిపి శ్రేణులు అభిమానించే ప్రజాప్రతినిధి సూచనల మేరకే కొలిక‌పూడి ఇంత ధీటుగా అడుగులు వేస్తున్నాడని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మనసులో మాటను బయట పెట్టకుండా ఉండలేని ప్రజాప్రతినిధిగా ఆయనకు గుర్తింపు ఉంది. కోస్తా జిల్లాలకు చెందిన ఆ ప్రజా ప్రతినిధుల్లోని ఆ గుణాలే వైసిపి వ్యతిరేకులకు దగ్గర చేశాయి. తర్వాత టిడిపిలో చేరి ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒకటిలే అన్నట్టు ఆయనపై సీఎం చంద్రబాబు దయ చూపారు.


ఆ ప్రజా ప్రతినిధి అప్పుడప్పుడు తనలోని అసంతృప్తిని బయటపెడుతూ ఉంటారు. ఆ ప్రజా ప్రతినిధిని కొలిక‌పూడిని తన రాజకీయ గురువుగా భావిస్తున్నారు. అవకాశం ఉంటే నేరుగా లేదంటే సెల్ ఫోన్ లో నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారట. ఇక తిరువూరులో తన ఉనికికే ప్రమాదం వచ్చేలా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని ఆవేదన ఆగ్రహంతో కొలిక‌పూడి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయ‌న పై వేటు వేస్తే టిడిపికి ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: