ఈ నేపథ్యంలో కాపులను వైసీపీ రెచ్చగొడుతోందా? అనేది ప్రశ్న. ఈ వ్యవహారం తెరమీదికి రాగానే.. జనసేన పార్టీ అన్యాపగానే అలెర్ట్ అయ్యింది. మనవంతుగా వైసీపీపై కౌంటర్ ఎటాక్ చేయాలన్నది జనసేన వ్యూహం. తద్వారా.. కాపులను టార్గెట్ చేసుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టాలన్న పవన్ కల్యాణ్ వ్యూహం తెరమీదికి వచ్చింది. అయితే.. ఇది ఏమేరకు నాయకులు సక్సెస్ చేస్తారన్నదివారి దూకుడును బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇక, నిజానికి అంబటి చేసిన వ్యాఖ్యలు.. అనంతరం జరిగిన పరిణామాలను ఒక వర్గానికి ముడి పెట్టడం ఎంత వరకు సమంజసం అనేది ప్రశ్న. ఎందుకంటే.. అంబటి చేసిన వ్యాఖ్యలు.. కాపు సామాజిక వర్గం కోసం కాదు. కేవలం వైసీపీని కాపాడుకునేందుకు.. లేదా ఆయన తన సింపతీని పెంచుకునేందుకు చేశారన్న వాదన వైసీపీలోనే వినిపిస్తోంది. అలాంటి సమయంలో కాపుల ప్రస్తావనను ముద్రగడ తెరమీదికి తీసుకువచ్చి.. తమకు ఏదో అన్యాయం అవుతోందన్న వాదనను వినిపిస్తుండడం కూడా సరికాదని అంటున్నారు.
గతంలోనూ ఇలానే ఏది జరిగినా.. కాపులకు ముడిపెట్టి రాజకీయాలు చేశారు. దీంతో కాపుల్లో ఆందోళన పెరిగేలా వ్యవహరించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కాపు సమాజంలో ఏదైనా అలజడి వస్తే.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడగానే చెబుతున్నారు. నిజానికి అంబటి రాజకీయం కేవలం వ్యక్తిగతం లేదా.. వైసీపీకి సంబంధించిన వ్యవహారం. దీనిలో అనవసరంగా కాపులను లాగే ప్రయత్నం చేయడం సరికాదని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి