తెలంగాణలోని ఎయిమ్స్‌, బీబీనగర్‌ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎయిమ్స్‌-భోపాల్‌ ఆధ్వర్యంలోని బీబీనగర్‌ (తెలంగాణ) ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

ఇక్కడ మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు . డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. టీచింగ్‌/ పరిశోధన అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 29, 30 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లవచ్చు. ఇంటర్వ్యూ కోసం నేరుగా ఎయిమ్స్‌, భోపాల్‌ వెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

 

 

ప్రతి రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్థ ఉండాలన్న ఆశయంతో కేంద్రం ఎయిమ్స్ సంస్థలను స్థాపించింది. తెలంగాణలో ఎయిమ్స్ సంస్థను హైదరాబాద్ నగర శివార్లలోని బీబీ నగర్‌లో నెలకొల్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: