యోగా గురువుగా మారడానికి ముందు యోగ బోధకుని పర్యవేక్షణలో మెళకువలు నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం చాలా  ముఖ్యం. నిరంతరం ఆచరణ, మనసు లగ్నం చేయడం, సహనం, అంకిత భావం చాలా అవసరం.యోగా ను వృత్తిగా మార్చుకోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల్లో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం యోగా గురువులను సర్టిఫై  చేయడానికి స్కీమ్ ఫర్ వాలంటరీ సర్టిఫికేషన్ ఆఫ్ యోగా ప్రొఫెషనల్స్ ను ప్రవేశపెట్టింది. ఇందులో యోగా బోధకుని సర్టిఫికేషన్, యోగా గురువు సర్టిఫికేషన్, యోగా మాస్టర్ సర్టిఫికేషన్, యోగా ఆచార్య సర్టిఫికేషన్లుగా వర్గీకరించింది. దీనికి సంబందించిన ప్రమాణాలను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. 

 

జాబ్ ప్రొఫైల్స్:

  1. రీసెర్చ్ ఆఫీసర్- యోగా అండ్ నేచురోపతి
  2. యోగా ఏరోబిక్ ఇన్‌స్ట్రక్టర్‌
  3. క్లినికల్ సైకాలజిస్ట్
  4. యోగా థెరపిస్ట్
  5. యోగా ఇన్‌స్ట్రక్టర్‌
  6. యోగా టీచర్
  7. థెరపిస్ట్ /నాచురోపత్స్
  8. ట్రైనర్/ ఇన్‌స్ట్రక్టర్‌ హెల్త్ క్లబ్

 

ఉపాధి అవకాశాలు:

 

యోగాలో శిక్షణ పొందిన ఆధారంగా రీసెర్చ్, ట్రైనింగ్ విభాగాల్లో స్థిరపడవచ్చు. అదేవిదంగా యోగా థెరపిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించొచ్చు. రిసార్టులు, జిమ్స్, స్కూల్స్, హెల్త్ సెంటర్స్, హౌసింగ్ సొసైటీస్  లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. టీవీ ఛానళ్లు, సెలెబ్రిటీలు, ఉన్నత స్థాయి వ్యక్తులు తమకోసం వ్యక్తిగత ట్రైనర్ లను పెట్టుకుంటున్నారు. ఒత్తిడి నుంచి బయట పడడానికి సెలువు రోజులలో విదేశీ పర్యాటకులు ఇండియాకు వస్తున్నారు. వేతనాల విషయానికి వస్తే ఫ్రెషర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వారు 15000 నుండి 20000 వరకు సంపాదించవచ్చు.అనుభవం పెరిగిన కొద్దీ వేతనాలు  వేగంగా పెరుగుతాయి.

 

యోగా టీచర్ గా మారేందుకు దేశంలో పలు విద్య సంస్థలలో అందుబాటులో ఉన్న ప్రాథమిక కోర్సు బిఎ యోగా లేదా బియస్సి యోగా థెరపీ. 50 శతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమానం ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సు ల్లో  చేరేందుకు అర్హులు. వీటిని పూర్తీ చేసిన వారికీ ఎంఏ/ఎంఎస్సి యోగా థెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా పలు పిజి డిప్లొమా, డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరి యోగా లో నైపుణ్యం పొందవచ్చు.

 

గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్, ఎస్ డి ఎం కాలేజ్ అఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఉజిరే, కర్ణాటక, జెఎస్ఎస్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, కర్ణాటక, శివరాజ్ నేచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజీ, సేలం, గవర్నమెంట్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, దుర్గం, ఎస్ ఆర్ కే మెడికల్ కాలేజ్ అఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, తమిళనాడు మొదలగునవి కొన్ని ముఖ్యమైన యోగా కోర్సులను అందిస్తున్న విద్య సంస్థలు.

మరింత సమాచారం తెలుసుకోండి: