తెలంగాణా బంగారు గని సింగరేణి ఉద్యోగాలకి పిలుపు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి కాలరీస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వేరు వేరు విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్  కేడర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులని భర్తీ చేయనుంది. మొత్తం 42  ఖాలీలకి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకి వెళ్తే...

IHG

మొత్తం పోస్టులు : 42

పోస్టుల వివరాలు 

మేనేజ్మెంట్ ట్రైనీ (F/A) : 20

మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్) : 18

మేనేజ్మెంట్ ట్రైనీ (లీగల్) : 4

 

అర్హతలు :

మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ పోస్టుకు సిఎ, ఐసిడబ్ల్యూఎ , సీఎంఎ ఉండాలి. పర్సనల్ పోస్ట్ కు రెండేళ్ల ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లమో లేదా హెచ్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ లేదా హెచ్ స్పెషలైజేషన్ తో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లో 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి.

లీగల్ పోస్టుకు న్యాయశాస్త్రంలో మూడేళ్లు లేదా ఐదేళ్ల డిగ్రీ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి

 

వయస్సు : 01-03-2020 నాటికి 30 ఏళ్ళు ఉండాలి.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-03-2020

చివరి తేదీ : 14-03-2020

దరఖాస్తు ఫీజు : రూ. 200

 

ముఖ్యమైన లింక్ లు

నోటిఫికేషన్  - https://scclmines.com/012020/Docs/Notification.pdf

దరఖాస్తు కోసం - https://scclmines.com/012020/

 

మరింత సమాచారం తెలుసుకోండి: