పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు భారతీయ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుద్యోగులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్తున్నా, వారికి భారతీయ రైల్వే రాయితీలను భారీగా ఇవ్వనుంది. కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ లకు వెళ్లే 35 ఏళ్ల లోపు నిరుద్యోగులకు సెకండ్ క్లాస్ పూర్తి బేసిక్ ఫెయిర్ స్లీపర్ క్లాస్ లో 50% బేసిక్ ఇస్తున్నామని రైల్వే మంత్రి  పియూష్ గోయల్ తెలిపారు.

IHG

అలాగే  ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి కూడా స్లీపర్ లేదా సెకండ్ క్లాస్  బేసిక్ 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఓకే సూపర్ ఫాస్ట్ సర్ చార్జ్ లని చెల్లించాలని ఆర్ ఆర్ బి, ఆర్ ఆర్ సి, నిర్వహించే పరీక్షలకు వెళ్లే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాదు...

IHG

నిరుద్యోగులకు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా భారతీయ రైల్వే రాయితీలను అందిస్తోంది. సొంత ఊళ్ళకి  లేదా ఎడ్యుకేషనల్ టూర్లకు వెళ్లే జనరల్ కేటగిరీ విద్యార్థులకు సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ హలో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే 75 శాతం తగ్గింపు లభిస్తోంది. అమ్మాయిలకు గ్రాడ్యుయేషన్ వరకూ, అబ్బాయిలకు కు 12 వ తరగతి వరకు ఉచితంగా సెకండ్ క్లాస్ నెలవారీ సీజన్ టిక్కెట్లు అందిస్తోంది భారతీయ రైల్వే తెలిపింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: