దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షలు అన్ని ఒక్కకొక్కటిగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రం 30కిలో మీటర్ల దూరంలోనే అధికారులు కేటాయించారు. ఇక దేశంలో కరోనా వైరస్ కారణంగా అభ్యర్థులు అధికారులు ప్రకటించిన నియమాలను తప్పక పాటించాల్సిందే అని అన్నారు.

అయితే మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేటగిరి–1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకొక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 20 – 26వ తేదీల మధ్య ఏడు రోజుల పాటు రెండు పూటలా 14 రకాల రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

అంతేకాక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు ఉదయం కేటగిరి –1 పోస్టులకు 2,228 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.57 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. ఇక తొలిరోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.24 లక్షల మంది 1,067 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రెండో రోజు నుంచి ఒక్కొక్క రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మేరకు గరిష్టంగా 516, కనిష్టంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్లపై ఉన్న నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ http://wardsachivalayam.ap.gov.in/ , http://gramasachivalayam.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: