ఇక ఉద్యోగులకు మాత్రమే కాదు.. సెల్లర్ పార్ట్‌నర్స్, ఎంఎస్ఎంఈలు, కళాకారులకు కూడా ప్యాకేజింగ్, వేర్‌హౌజ్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వనుందని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ సహకారం తీసుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు కొన్ని నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతోంది ఇ-కామర్స్ కంపెనీ. కెపాసిటీ, స్టోరేజ్, సార్టింగ్, ప్యాకేజింగ్, హ్యూమన్ రీసోర్సెస్, ట్రైనింగ్, డెలివరీపై దృష్టి పెట్టింది ఫ్లిప్‌కార్ట్. అందులో భాగంగానే 70,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది.
అంతేకాదు వీటిలో చాలావరకు పోస్టులకు ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ పార్ట్‌నర్ లొకేషన్స్, కిరాణా షాపుల్లో పరోక్షంగా ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. 50,000 కిరాణా షాపుల్ని తమ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చిందన్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వీరి పాత్ర కూడా కీలకం కానుందన్నారు. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఇకామ్ ఎక్స్‌ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించిందని నిపుణులు తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఫెస్టివల్ సేల్ సందర్భంగా వచ్చే ఆర్డర్స్‌ని డెలివరీ చేసేందుకు 30,000 పోస్టుల్ని భర్తీ చేయనుందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి