ఇక యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉపాధి కల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ అయితే మంచి ప్రోపర్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తు ప్రశంసలు అందుకుంటున్నారు.ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంటర్ పూర్తి చేయగానే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తలుపు తట్టనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి.. HCL కంపెనీతో అగ్రిమెంట్ ని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఉద్యోగం కావాలనుకునే స్టూడెంట్స్.. ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా మ్యాథ్స్ తీసుకోవాలి. ఇందులో సంవత్సరానికి ఇలా 20 వేల మందిని హైర్ చేయనుంది HCL కంపెనీ.ఇక గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో HCL కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ని పెడతారు. ఈ పరీక్షలో మ్యాథ్స్‌తో పాటు ఆంగ్లం ఇంకా అలాగే లాజికల్ రీజనింగ్ ఉంటాయి.


ఇక ఇందులో మొత్తం 60 పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇక ఇది కూడా ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది. ఇందులో కనుక విద్యార్థులు మంచి టాలెంట్ చూపిస్తే.. వారికి జాబ్ ఇస్తారు. సెలక్ట్ అయినవారికి ఆన్‌లైన్‌లో 6 నెలలు ట్రైనింగ్ ని కూడా ఇస్తారు. ఇక అది కంప్లీట్ అయ్యాక HCL ఆఫీసులో మరో 6 నెలలు ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఉన్నప్పుడు వారికి 10 వేలు స్టైఫండ్ ఇస్తారు. ఇక ఇది  కంప్లీట్ అయ్యాక జాబ్‌లో జాయిన్ అవ్వాలి. ఉద్యోగంలో జాయిన్ అయినవారికి సంవత్సరానికి రూ. 2,50,000 వార్షిక వేతనం ఇస్తారు. అంటే నెలకు 20 వేల రూపాయలు చేతికి వస్తుంది.ఇందులో ఇంకో సౌలభ్యం ఏంటంటే.. జాబ్ చేస్తూనే బిట్స్, ఎమిటీ వంటి యూనివర్శిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కూడా చేయొచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి..మీకు శాలరీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్..

మరింత సమాచారం తెలుసుకోండి: