ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కరోనా వైరస్ ఇబ్బంది పెడుతూ ఉంటే... మరోవైపు బంగారు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రంగాలు దెబ్బతిన్న సమయంలో కూడా బంగారు వెండి ధరలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకు వస్తున్నాయి. ఇక శనివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 680 పెరిగి రూ. 54,500 రూపాయల వరకు పలికింది. అదే మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 55,820 కి పెరిగింది. దీంతో గత పది రోజుల్లో పోలిస్తే... 10 గ్రాముల బంగారం ధర నాలుగు వేల వరకు పెరిగింది. ఇందుకు వివిధ కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, అలాగే దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఇలా రేట్లు పెరగాల్సి వచ్చింది.


అయితే కేవలం బంగారం మాత్రమే కాకుండా.. వెండి కూడా బంగారం కంటే వేగంగా ధరలు దూసుకు వెళుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర రూ. 2850 రూపాయలు పెరిగి రూ. 65,900 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ పరంగా ఔన్స్  గోల్డ్ 1976 డాలర్లకు చేరుకోగా, వెండి 24 డాలర్లకు పైగా చేరుకుంది. ఇక ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి బంగారం వెండి ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. ఓవైపు డాలర్ వాల్యూ పడిపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీసేలా కరోనా కేసులు అక్కడ ఎక్కువవడంతో ఇన్వెస్టర్లు ట్రేడ్ మార్కెట్ కంటే బంగారం వెండి వైపు అధిక పెట్టుబడులు పెట్టడం తో ఈ పరిస్థితి నెలకొంది. అయితే మార్కెట్ నిపుణులు అంచనా మేరకు బంగారం వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు అన్నట్లు తెలుపుతున్నారు. ఇక శుక్రవారం నాడు అత్యధికంగా 1983 డాలర్లకు పైగా బంగారం పలికింది.


అలాగే తాజాగా హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 51,780 కు చేరుకుంది. ఆపై కేజీ వెండి ధర కూడా రెండు వేల రూపాయలు పెరిగి 65 వేలకు చేరుకుంది. ఇక శ్రావణ మాసం మొదలు అయినా కూడా రిటైల్ రంగంలో అనుకున్నంతగా బంగారానికి డిమాండ్ లేదని వ్యాపారులు తెలుపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ధరలు ఆకాశాన్ని చేరుకోవడమే. ముందు ముందు మధ్యతరగతి ప్రజలు, బీదవారు బంగారం కొనాలంటే కష్టమే సుమా...!

మరింత సమాచారం తెలుసుకోండి: