పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.. ఎందుకంటే రోజు రోజుకు రేట్లలో మార్పులు వస్తుంటాయి. ఒక్క రోజుకి ఊహించని రేంజులో రేట్లు పెరిగాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజులు ధరలు పైకి ఎగిసాయి.మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఓ మాదిరిగా ఉన్నా కూడా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. ఈరోజు పెరిగిన ధరలు మార్కెట్పై ప్రభావాన్ని చూపించింది. 



బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 45,650 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,800 రూపాయలుగా నమోదు అయింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే పెరిగాయి. ఈరోజు 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 70వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 70,700 రూపాయల వద్ద నమోదు అయింది.



విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి.బుధవారం బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 45,650 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. మొత్తానికి ఈరోజు రేట్లు చూస్తే భారీగా పెరిగాయి. ఎంత పెరిగినా కూడా పసిడి ప్రియులు మాత్రం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. రేపటి రేట్లు ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: