రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు నేడు తగ్గాయి. నిజానికి కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అసలు తగ్గుతుందా ? ఇంకా పైపైకి పెరుగుతూ నిరాశను కలిగిస్తుందా ? అన్న అనుమానంలో ఉన్న ప్రజలకు నేడు తగ్గిన బంగారం ధరలు కాస్త ఊరట కలిగించాయని చెప్పాలి. బంగారం కొంతమేర తగ్గినప్పటికీ వెండి మాత్రం పెరిగింది. మరి ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గింది. తగ్గినధరలతో కలిపి దేశంలోని కొన్ని నగరాల్లో బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,120, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,120
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,420

పసిడి కాస్త తగ్గినప్పటికీ దేశరాజధాని ఢిల్లీలో నమోదవుతున్న ధరలు మాత్రం సామాన్యులకు అందకుండా ఉన్నాయి. ఈరోజు గరిష్టంగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా నమోదైంది. కాగా బెండి మాత్రం కొంతమేర పెరిగి షాకిచ్చిందనే చెప్పాలి. వెండి నేడు రూ.4,000 పెరిగింది.ఈరోజు ధరలతో కలిపి కేజీ వెండి ధర రూ.71,500కు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో కేజీ వెండి ధర రూ. 71,500 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ.66,600 ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: