సహజంగా పిల్లలు పూర్తి ఆరోగ్యంగా పుట్టిన వారిని చూసి తల్లిదండ్రులు పరమసంతోషం పొందుతారు. తమ ప్రేమకు రూపాన్ని చూసి మురిసిపోతుంటారు. అలా ఆ పిల్లవాడు పెరిగిపెద్దవుతూ తమకు పేరు తెచ్చిపెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఇంకా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇదంతా సాధారణంగా పరిస్థితులు ఉన్నప్పుడు, అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జన్యుసంబంధిత లోపల వలన కావచ్చు, పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎదగలేని స్థితిలో జన్మిస్తున్నారు. వాళ్ళను వైద్యపరంగా ఆటిజం అనే మానసిక వ్యాధి కింద పరిగణిస్తున్నారు. అలాంటి వారిపై సాధారణ పిల్లలపై కంటే కాస్త ఎక్కువ శ్రద్ద చూపించడం అత్యవసరం. తద్వారా వారి పనులు వాళ్ళు చేసుకునేట్టుగా వారిని తీర్చిదిద్దవచ్చు. అలాగే వారు కూడా సాధారణ జీవితాన్ని గడిపే విధంగా తర్ఫీదు ఇవ్వడం వలన వారు కూడా ఈ కాంపిటీటివ్ వరల్డ్ లో తమ ముద్ర వేసుకునేందుకు సిద్ధం అవుతారు. దానికి కావాల్సింది కాస్తంత ఎక్కువ ప్రేమ, కాస్త ఓపిక.

అవన్నీ దొరికేది అమ్మ ఒడిలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ప్రేమ మూర్తిగా అమ్మను మొదటి నుండి భారతదేశం నమ్ముతుంది. అలాంటి అమ్మ ప్రేమ తో కాస్త ఆయా పిల్లలకు కావాల్సిన సరైన వైద్య మరియు తర్ఫీదు కేంద్రాలు ఉంటె వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. వాళ్ళు త్వరగా ప్రస్తుత ప్రపంచానికి తగ్గట్టుగా సిద్ధం అవుతారు. ఒకరి మీద ఆధారపడకుండా తమ పిల్లలు బ్రతకాలని ప్రతి తల్లితండ్రి కోరుకుంటారు. అలాంటి తర్ఫీదు ఈ తరహా పిల్లలకు ఇచ్చే సంస్థలు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నప్పటికీ అందులో పినాకిల్ బ్లూమ్స్ ఫలితాలు చెప్పుకోదగ్గ రీతిలో ఉంటూ, అందరిని ఆకర్షిస్తున్నాయి. అంటే ఇక్కడ తల్లి ప్రేమతో పాటుగా ఒడిని కూడా పిల్లలకు పంచుతూ ప్రతి విదార్థిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారి ఇచ్చే తర్ఫీదు ఆయా పిల్లలను రేపటికి త్వరగా సిద్ధం కావడానికి బాగా సహకరిస్తుంది.  

2017లో ఈ సంస్థ సరిపల్లి కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ సంస్థలో ఆటిజం తో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. మానసికంగా ఎదగని ఎందరో పిల్లలకు సేవ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా థెరపీలు అందిస్తున్నారు. అయితే సమస్య ను దగ్గరనుండి చుసిన ఈ సంస్థ స్థాపకులు అలాంటి వారికి సరైన వైద్యం అందాలనే లక్ష్యంతో దానిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హైదరాబాద్ లోనే కాకుండా పలు ప్రాంతాలలో ప్రస్తుతం అనేక బ్రాంచీలను ఏర్పాటు చేసుకోగలిగింది. తద్వారా అనేక మంది పిల్లలకు వారు వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. సంస్థ ఏర్పాటు ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారు కాబట్టి నేడు అనేక మందికి సేవలు అందించగలుగుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం 1500మంది పిల్లలకు చికిత్స అందుతుంది. ఆర్థికంగా సామర్యం లేని వారికి కూడా అనేక రాయితీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి సమస్యకు ఇంకా అవగాహనా లేకపోవడం తో అక్కడి వారి కోసం కూడా ప్రత్యేక సేవలు ప్రారంభించారు. ఈ సంస్థ జాతీయంగా హెల్ప్ లైన్ 190018181 కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా తమ పిల్లలలో అటిజం లక్షణాలు ఉంటె ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేసి వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: