
అయితే ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో రష్మిక ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఆ ఫోటోలో రష్మిక చీరలో చాలా సాంప్రదాయంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి"నాకు తెలిసి మీరంతా దీని కోసమే ఎదురు చూస్తున్నారు అంటూ" ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. అయితే తాను నటిస్తున్న " ది గర్ల్ ఫ్రెండ్ " రిలీజ్ డేట్ గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎంగేజ్మెంట్ గురించి క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఆశపడినప్పటికీ ఇలా ట్విస్ట్ ఇవ్వడంతో డిసప్పాయింట్ అయ్యారు..
మరి కొంతమంది ఇలా రెండు వార్తలకు ఒకేసారి హింట్ ఇచ్చిందేమో అంటు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే ఒక మస్ చిత్రంలో చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది కింగ్డమ్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు విజయ్ దేవరకొండ. రష్మిక సినిమాల విషయానికి వస్తే" ది గర్ల్ ఫ్రెండ్", బాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తోంది. ఈ ఏడాది కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది.