
ఆముదపు గింజలు ప్రయోజనాలు..
ఆముదపు గింజలలో 'విటమిన్ ఈ 'అధికంగా ఉండడం వల్ల, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటి నుంచి తీసే పాలు జుట్టు మృదువుగా, జీవము సంతరించుకునేలా తయారుచేస్తుంది.
చిట్కా 1:
ఈ ప్యాక్ కోసం 100 గ్రాములు గింజలు తీసుకుని, మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి, బాగా మిక్సీ పట్టుకోవాలి.వీటి నుంచి వచ్చిన మిశ్రమాన్ని ఒక గుడ్డలో వేసి, బాగా పిండి పాలను తీయాలి.ఆ పాలలోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జు, రెండు స్పూన్ల మెంతి పొడి, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి.ఇలా కలపగా వచ్చిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి,గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత బాగా మర్ధన చేస్తూ, మైల్డ్ షాంపూ తో శుభ్రం చేసుకోని, హెయిర్ సీరం ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల, జుట్టు మృదువుగా,అందంగా పెరుగుతుంది.మరియు ఇందులో వాడిన కాఫీపౌడర్ లో ఉండే కెఫిన్ తెల్లజుట్టు త్వరగా రాకుండా సహాయపడుతుంది.ఆముదపు గింజల పాలల్లో ఉండే' విటమిన్ ఈ' జుట్టు చిట్లిన చివర్లను రిపేరు చేయడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యం కోసం ఇలాంటి చిట్కాలే కాక, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.