ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చికెన్ అనగానే పలు రకాల రెస్టారెంట్ హోటల్స్ లో ఉండే వాటిని తింటూ ఉంటారు. అంతలా చికెన్ కి బానిసలు అయిపోతూ ఉన్నారు ప్రజలు. అయితే ఇది మంచిది కాదు అంటున్నారు కొంతమంది పరిశోధకులు ఈ విషయం పైన కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి కొన్ని విషయాలను తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం


చికెన్ ఎక్కువగా తినేవారు ప్రపంచంలోనే పదోవ అతిపెద్ద వ్యాధికి బానిసగా చేస్తుందట. ఇది చెప్పింది ఎవరో కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO ) చికెన్ ఎక్కువగా తినడం వల్ల యాంటీ  మైక్రో బయల్ రెసిస్టెంట్(AMR) ను కలిగిస్తుందని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. AMR అనే వ్యాధి ప్రపంచంలోనే పదోవ జాబితాలలో ఉన్నది దీనిపైన ఆరోగ్య నిపుణులు తెలియజేయడం ఏమిటంటే చికెన్ తినడం వల్ల ప్రజలు అత్యంత వేగంగా ఈ వ్యాధి బారిన పడుతారట. చికెన్ లో ప్రోటీన్లు మినరల్స్ విటమిన్లు వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతూ ఉంటారు.. అయితే ఇలాంటివి ఉన్నప్పుడు అవి అనారోగ్యానికి ఎలా గురిచేస్తాయి అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.


ప్రస్తుతం ఉన్న రోజుల్లో చికెన్ ఆరోగ్యంగా ఉంచడానికి యాంటీబయోటిక్స్ ను పౌల్ట్రీ లలో ఇస్తున్నారు.. దీనివలన కోడి శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయోటిక్ పేరుకు పోతుందట. ఇది చికెన్ తినే వారి శరీరం పైన నేరుగా తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా చికెన్ తినడం వల్ల శరీరంలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీని వల్ల చెడు ప్రభావం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి స్థితిలో శరీరంలో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతాయట. ఈ ఇన్ఫెక్షన్ చికిత్స కష్టతరమైనదట.. ఇలాంటి సమయంలో ఆకుపచ్చ కూరగాయలు పన్నీర్, పాలు ,పెరుగు ,తినడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: