అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే ఎవ‌రైనా సరే.. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవాల్సిందే. ఎందుకంటే.. నిత్యం త‌గినంత ప్రోటీన్ శ‌రీరానికి ల‌భిస్తే దాంతో శరీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ సాఫీగా జ‌రుగుతాయి. ఫ‌లితంగా మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ప్రోటీన్స్ వాల్ల‌ ప్రయోజనాలు పుష్కలం. ఇవి శరీరానికి డైలీ వారిగా చాల అవసరం. అయితే ప్రోటీన్ ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన‌ప్ప‌టికీ.. అవగాహన లేకుండా ఎక్కువ ప్రొటీన్‌ వాడితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

నిపుణులు సూచిస్తున్న లెక్కల ప్రకారం.. పురుషులకు రోజులు 56గ్రా, మహిళలైతే 45గ్రా సహజసిద్ధమైన ప్రొటీన్లు అవసరం. 11-14 ఏళ్ల వయసు పిల్లలకు శరీర బరువు ఎంత ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్‌, 14- 18 వయసు పిల్లలకు శరీర బరువులో కిలోకు 0.8 గ్రాములు, గర్భిణులు కిలో శరీర బరువుకు 1.5గ్రా ప్రొటీన్‌, మెనోపాజ్‌ మహిళలకు కిలో శరీర బరువుకు 1గ్రాముల చొప్పున ప్రొటీన్‌ అవసరం. ఆయా  వ్యక్తుల వృత్తి, వయసు వంటి అంశాలను బట్టి ఈ లెక్కలు మారతాయి.

 

ఇక అవసరానికి మించి ప్రొటీన్లు తీసుకొనే వారిలో కీటోన్లు పెరిగి వాటిని వడకట్టటం మూత్రపిండాలకు కష్టమవుతుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మీరు ఒక క్రమబద్దమైన డైట్ ను ఫాలో అవుతున్నప్పట్టికి, ఎలాంటి స్న్కాక్స్, స్వీట్స్ లోనటి జంక్ దూరంగా ఉన్నప్పటికీ వెయిట్ పెరుగుతునన్నట్టుయితే మీ డైట్ లో ప్రోటీన్ పరిమితి కి మించి ఉందని అర్ధం. సహజంగా, హై ప్రోటీన్ డైట్ వలన బరువు తగ్గడం కూడా జరుగుద్ది, కాని మోతాదుకు మించి తీసుకుంటే, ఓవరాల్ వెయిట్ పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: