ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా క‌ష్టాలు వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. క్ర‌మంగా ప్ర‌పంచ‌దేశాల‌కు వ్యాప్తిచెంది ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కాటుకు ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంత మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌వుతారో అర్థం కావ‌డం లేదు. మ‌రోవైపు ఈ ప్రాణాంత‌క క‌రోనా వ‌చ్చి ఏడు నెల‌లు గ‌డుస్తున్నా.. వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అస‌లు ఎప్పుడు వ‌స్తుందో కూడా తెలియ‌డం లేదు.

దీంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు ప్ర‌పంచ‌దేశాల ప‌రిశోధ‌క‌లు క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనే దిశ‌గా వంద‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు. ఇక నిపుణులు మాత్రం క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే.. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచ‌డంలో.. ముల‌క్కాడ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో ఈ ముల‌క్కాడ‌లు కూడా ఒక‌టి. ముల‌క్కాడ‌ల్లో ఐరన్‌, కాల్షియంతో పాటు విటమిన్ సి కూడా పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో రోగాల‌తో పోరాడే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంపొందిస్తుంది. త‌ద్వారా క‌రోనా వంటి భ‌యంక‌ర వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే గొంతు బొంగురు పోయినపుడు, జలుబు చేసినపుడు ములక్కాడలతో చేసిన వంట‌లు తింటే ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా వంటి అనేక శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి ములక్కాడలు సహాయపడుతుంది. మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ములక్కాడ రసాన్ని లేదా పాలతో తీసుకోవటం వలన ఎముకల ఆరోగ్యం మేరుగుప‌డ‌తాయి. ముల‌క్కాడ‌ల్లో లభించే పీచు, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అదే స‌మ‌యంలో జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. ఇక మునగాకాడలోని ఐరన్ రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ఇంకా ఇందులో మెగ్నీషియం, సెలీనియం, మ్యాంగనీస్ వంటివి ఆరోగ్యానికి సహాయపడేవి పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: