చాలా మంది ఈ కాలంలో రాత్రి పూట నిద్రపోవడం మరిచిపోయారు. రాత్రి నిద్ర పోకుండా స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ నైట్ నిద్ర పోవటం మానేసి పగలు నిద్ర పోవటం అలవాటు చేసుకున్నారు. కంటి నిండా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. లేకపోతే.. అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ బిజీ లైఫ్‌.. స్మార్ట్ ఫోన్ యుగంలో నిద్ర అనేది క్రమేనా అంతరించిపోతోంది. ఎనిమిది గంటల నిద్ర కాస్త ఐదు నుంచి ఆరు గంటలకు కుదించుకుపోతోంది. ఈ నేపథ్యంలో స్వీడన్‌‌లోని స్టాక్‌హామ్‌లో గల కరోలినస్కా ఇనిస్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ సుసన్నా లరస్సాన్, షుయాయి యువాన్ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న టైప్-2 మధుమేహంకు దారి తీస్తున్న ప్రధాన కారణాలను వీరు కనుగొన్నారు.

ఈ కారణాల్లో నిద్రలేమి వల్ల బాధపడేవారే ఎక్కువగా టైప్-2 డయబెటీస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు టైప్ డయబెటీస్‌ మీద పబ్‌మెడ్ డేటా బేస్‌లోని 1,360 ఆర్టికల్స్‌ను స్టడీ చేశారు.

ఇందులో భాగంగా 34 అంశాలను కనుగొన్నారు. వీటిలో 19 ముప్పు కలిగించే కారకాలు, 15 ప్రొటెక్టీవ్ మేలు చేసేవి విషయాలను తెలుసుకున్నారు. ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యతో బాధపడుతున్నవారిలో టైప్-2 డయబెటీస్ వచ్చే అవకాశాలు 17 శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇప్పుడున్న ప్రతికూల అంశాల్లో డయబెటీస్‌కు దారి చేసే ప్రధాన ముప్పుగా ఇన్సోమ్నియా అని తెలిపారు.

నిద్రలేమి తర్వాత.. పగటి వేళ్లలో నిద్రపోవడం, మద్యసేవనం, బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం, కోడి నిద్ర, యురినరీ సోడియం లెవెల్స్, అమీనో యాసిడ్స్ తదితర కారణాలు టైప్‌-2 డయబెటీస్‌కు దారితీయొచ్చని కొన్ని పరిశోధనలో  పేర్కొన్నారు.

కాబట్టి అందరు తప్పనిసరిగా రాత్రి పూట నిద్ర పోవాలి. ఒకేవేళ నిద్ర రాకపోయినా కాని కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఒక రెండు గంటల పాటు నిద్ర వచ్చిన రాకపోయినా కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఆటోమాటిక్ గా నిద్ర వస్తుంది. కాబట్టి పగలు నిద్ర పోయే అలవాటు ఉంటే తక్షణమే మానుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: