భూమి మీద ఉన్న వృక్ష జాతులలో ప్రతి ఒక్క మొక్క ఏదో  విధంగా మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి మొక్కలో ఒకటి ఈ సరస్వతి మొక్క కూడా.. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ మొక్క ఆకులను పలు ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


సరస్వతి మొక్క  పేరుకు తగినట్లుగానే పనిచేస్తుంది.  ఈ మొక్క ఆకులు వల్ల మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఈ మొక్క ఆకులను ప్రతిరోజు 4 తింటే మేధస్సు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు  చెబుతున్నారు.అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఇతర సమస్యలు ఉన్నా కూడా ఆకులు తింటే ప్రయోజనం కలుగుతుందని కూడా చెబుతున్నారు.

1).పచ్చ కామెర్లు వచ్చిన వారికి సరస్వతి మొక్క ఆకుల రసాన్ని నిత్యం తాగడం వల్ల ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.

2).సరస్వతి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎక్కువగా రక్తం బాగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

3). ఈ ఆకు రసం లోకి వాము పొడి కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

4).ఈ మొక్క ఆకులను మజ్జిగతో మూడు రోజుల నాన పెట్టిన తర్వాత వాటిని తీసి ఎండబెట్టిన అనంతరం వాటిని పొడిగా చేసి పిల్లలకు తాపడం ద్వారా బాగా శక్తి లభిస్తుంది.

5).సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి, పొడి చేసి అందులో తేనె కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. స్వరపేటిక వృద్ధిచెందుతుంది. మంచి కంఠస్వరం కూడా వస్తుంది.

6). సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి, బాదం పప్పు, మిరియాలు, వేడి నీరు పోసి  మొత్తం పేస్ట్ గా తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్టు ని 40 రోజుల పాటు ఉదయం తీసుకుంటే,  జ్ఞాపక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: