కరోనా వైరస్  జీవన ప్రక్రియ ఏంటి ?

కరోనా వైరస్ జీవన ప్రక్రియ ఏంటి ? ఎలా పుడుతుంది ? ఎలా వ్యాప్తి చెందుతుంది ? ఎంత కాలం ఉంటుంది ? చివరకు ఎలా అంతమవుతుంది ? ఈ ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడుప్పుడే కాదు... కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచం పై పడగ విప్పిన ప్పటి నుంచి. యావత్ మానవాళి వైరస్ ఉదృతి పై నిత్యం ఆందోళన చెందుతోంది. వైద్య రంగ పరిశోధకులు నిద్రాహారాలు మాని కరోనా పై పరిశోధనలు చేస్తున్నారు.


 అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వైద్య రంగ పరిశోధకుడు మార్టిన్  కరోనా వైరస్ జీవన ప్రక్రియ పై  అధ్యయనం చేశారు.  తాను కనుగొన్న కొత్త విషయాలను  ప్రపంచానికి వెల్లడించారు, మానవుల్లో కరోనా ప్రభవం,  వాటి జీవన ప్రక్రియ పై ఆయన తన బృందంతో పరిశోదనలుచేశారు. మానవుల్లో  పెంటోస్ ఫాస్పేట్ పాత్ వే అనే జీవన క్రియ వేగంగా జరుగుతున్నప్పుడు, అంతే చైతన్యవంతంగా ఉన్నప్పుడు కోవిడ్-19 సోకితే, కరోనా వైరస్  కణాలు వేగంగా వృద్ధి చెంతుతాయని మార్టన్ బృందం పేర్కోనింది. జర్మనీలో ని గోతే విశ్వ విద్యాలయం, బ్రిటన్ లోని కెంట్ యానివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు మార్టిన్ బృందం లో ఉన్నారు. వీరు కరోనా వైరస్ జీవన క్రియను అడ్డుకునే ఔషధాన్మి కూడా కనిపెట్టారు.  బెన్ వ్యూక్సీిథియామిన్ అనే ఔషధం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులపై జరిపిన పరిశోధనల్లో ఈ ఔషధ పలితాలు ఆశాజనకంగా ఉన్నాయని  చెప్పారు. ఈ మందు  వైరస్ కణాల పునరుత్పత్తిని అడ్డుకుందని తెలిపారు.
అంతే కాకుండా  ఇప్పటి వరకూ అందుబాటు లో ఉన్న యాంటీ వైరల్ ఔషధం డాక్సీ-డి-గ్లూకోజ్
పనిరును సమర్థవంతం చేసేందుకు  కూడా బెన్ వ్యూక్సీిథియామిన్  ఉపకరిస్తుందని చెప్పారు.  కోవిడ్ సోకినప్పుడు  మానవునిలో ఉండే ఆరోగ్య కణాలపై కరోనా వైరస్ కణాల ప్రభావం తగ్గించేందుకు యాంటీ వైరల్ ఔషధం డాక్సీ-డి-గ్లూకోజ్ సమర్థవంగా పనిచేస్తున్న విషయం ఇప్పటికే రుజువైంది. కోవిడ్ -19 పై జరుగుతున్న పరిశోధనల్లో ఇది మరో ముందడుగుగా  వైద్య రంగ నిపుణలు పేర్కోంటున్నారు. వైరస్ వ్యాప్తి, జీవన క్రియ, పునరుత్పత్తి  అంశాలపై పరిశోదనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వారు పేర్కోన్నారు.  కరోనా జీవన క్రియ పై బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తారని మార్టన్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: