అంతేకాకుండా నేటి రోజుల్లో ఆహారపు అలవాట్లు కూడా మనిషి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రతిరోజూ వ్యాయామం చేయకపోయినా కనీసం ఇంట్లో అయినా కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి రోజూ పుష్ అప్స్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు ఇంట్లో పుషప్స్ చేయడం వల్ల శరీర పై భాగం బలాన్ని పొందుతుంది.
అంతే కాకుండా కండరాలు ఛాతి భుజాలు చేతులు ఎంతో స్ట్రాంగ్ గా కూడా మారుతాయి. ఇక రెగ్యులర్ గా పుష్ అప్స్ చేయడం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇక క్రమం తప్పకుండా పుషప్స్ చేయడం వల్ల గుండెకు రక్త సరఫరా కూడా పెరుగుతుందట. అంతేకాదు ఇక పుష్ అప్ చేయడం వల్ల అటు బెల్లీ ఫ్యాట్ కలిగి పొట్ట తగ్గిపోతుంది అని చెబుతున్నారు నిపుణులు. అందుకే వ్యాయామం చేయడానికి సమయం లేనివారు కనీసం పుషప్స్ అయినా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి