రక్త దానం అనేది చాలా ముఖ్యమైన దానం. రక్త దానం చేయడం వలన ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. ఆరోగ్య వంతుడైన ఒక వ్యక్తి శరీరంలో 5 లేక 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుండి 350 మిల్లీ లీటర్ల బ్లడ్ సంవత్సరంలో మూడు , నాలుగు నెలలకు ఒకసారి డొనేట్ చేయడం మంచిదే అని డాక్టర్లు చెబుతున్నారు. రక్త దానం చేయడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవు అని వారు అంటున్నారు. అయితే మీరు దానం చేసేది కేవలం రక్తం మాత్రమే కాదు ఒక మనిషికి ప్రాణం కూడా. కాగా అందరూ రక్తం దానం చేయడానికి అర్హులు కారు. ఈ మాట ఎందుకు అంటే... కొందరికి వారికే సరిపడా రక్తం శరీరంలో ఉండకపోవచ్చు. అలాంటి వారు రక్త దానం చేయకూడదు.

హిమోగ్లోబిన్ 12 కంటే తక్కువ ఉండేవారు రక్త దానం చేయరాదు. అదే విధంగా అధికంగా మద్యం మరియు దూమపానం  చేసే వారు సైతం రక్తం దానం చేయకూడదు. పచ్చబొట్టు వేసుకున్న వారు కూడా రక్త దానం చేయరాదు.  పచ్చబొట్టు లేదా ట్యూటూ వంటివి వేసుకున్నవారు  కనీసం 4 నెలల నుండి 6 నెలల వరకు ఎవరికి రక్త దానం చేయరాదు.  యాంటీబయాటిక్స్ వాడేవారు.. అలాగే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు కూడా రక్త దానం చేయరాదు.  శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నవారు అలాగే యాంటీ బయాటిక్స్‌ వాడుతున్న వారు కూడా రక్త దానం చేయకూడదు.

ఒక వ్యక్తి శరీరం చాలా బలహీనంగా ఉన్నా..శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్‌ 12 కంటే తక్కువగా ఉన్నా రక్తదానం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో, రక్త దానం చేస్తే దాతల ఆరోగ్యం దిగజారుతుంది. అందువల్ల, రక్తదానం చేసే ముందు తప్పనిసరిగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి. కామెర్లు లేదా హెపటైటిస్ వంటి  వ్యాదు లతో బాధపడుతున్న వారు, క్యాన్సర్‌ బాధితులు ఉన్నవారు కూడా రక్తదానం చేయరాదు. 18 సంవత్సరాల లోపు వారు అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్దులు కూడా రక్త దానం చేయడం శ్రేయస్కరం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: