
1). మధుమేహంతో బాధపడుతున్న వారికి అంజీర పండు చాలా మేలు చేస్తుంది చెప్పవచ్చు ఈ పండులో మన శరీరానికి కావాల్సిన ఫైబర్ క్యాల్షియం పొటాషియం ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి వీటివల్ల రక్తంలోని ఉండే చక్కెర స్థాయిని సులభంగా నియంత్రించవచ్చు.
2). అంజీర పండు లోనే కాకుండా ఆకుల్లో కూడా పలు రకాల మూలకాలు ఉంటాయి అందుచేతనే మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ అంచుల ఆకులను ఏదైనా నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చుట.
3). డయాబెటిస్తో బాధపడేవారు ఎక్కువగా అంజూర పండు నే కాకుండా ఆపిల్ ,బ్లూ బెర్రీస్ ,చెర్రీస్, స్ట్రాబెర్రీలు పండ్లను కూడా తినవచ్చు.. ఇదే కాకుండా మరికొన్ని కూడా ఉన్నట్లుగా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
4). అంజీర పండులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని క్రమం తప్పకుండా తింటూ ఉండటం వల్ల పలు ప్రయోజనా లు కలగడమే కాకుండా రక్తంలోని ఉండే కొలెస్ట్రాలను సైతం తగ్గిస్తుంది.
5). అంజీర పండు ను షుగర్ పేషెంట్లే కాకుండా సాధారణమైన వ్యక్తులు కూడా తినడం వల్ల రక్తం పెరగడంతో పాటు.. శరీరం కూడా చాలా దృఢంగా తయారు అవ్వడానికి సహాయపడుతుంది.
6). ముఖ్యంగా అంజీర పండును పచ్చిగా తిన్నా సరే.. లేదంటే ఎండ పెట్టినవి తిన్న మరింత ఉపయోగం ఉన్నట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు.