చాలామంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రతిరోజు చేయడం వల్ల పలు రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. మరి కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు ఉదయం అల్పాహారం తీసుకోకుండా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండడం వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఈ కారణంగా రోజు మనకి కావాల్సిన పలు పోషకాలు లభిస్తూ ఉంటాయి. దీంతో మనకి శక్తి కూడా లభిస్తుంది పోషకాహార లోపం వల్ల అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఉదయం తీసుకోవలసిన ఆహారంలో కచ్చితంగా స్ట్రాబెరీ కూడా ఒకటి ఇందులో విటమిన్ -c చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇక మరొకటి కోడి గుడ్డు కూడా కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఇందులో కావలసిన పోషకాలు ప్రోటీన్లు క్రొవ్వు పదార్థాలు కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి.

అల్పాహారంలో కోడిగుడ్డు ఉండేలా వారంలో రెండుసార్లు అయినా ప్లాన్ చేసుకోవాలి ఉడకబెట్టిన లేదా ఆమ్లెట్ రూపంలో నైనా వీటిని తీసుకోవచ్చు. ఇక మరొకటి నెయ్యి ఆవు నెయ్యిని అల్పాహారంలో తినడం వల్ల విటమిన్ ఈ కేలు కూడా పుష్కలంగా లభిస్తాయి.ఇందులో ఆరోగ్యమైన కొవ్వులు కూడా అందుతాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో బాదంపప్పు తీసుకున్న వారు చాలా హెల్తీగా ఉంటారు రాత్రిపూట కొన్ని బాదంపప్పును నానబెట్టి ఆ తర్వాత రోజున వాటిని తిన్నట్లయితే పలు పోషకాలు పుష్కలంగా లభిస్తాయట. వీటితోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తిన్నట్లు అయితే గుండె కు , ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఇందులోకి అరటిపండు కలుపుకొని తింటే హైబీపీ ఉన్నవారు తగ్గుముఖం పడుతుంది. గ్రీన్ టీ తీసుకున్న వారు కూడా కొవ్వు పదార్థాలు కరిగేలా చేస్తుంది దీంతో బరువు త్వరగా తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: