మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది కూడా నేరుగా పచ్చిగానే తింటుంటారు.అయినా ఇవి చాలా రుచిగా ఉంటాయి.ఇక క్యారెట్లతో చాలా మంది చాలా రకాల వంటలను చేస్తుంటారు. వీటితో పచ్చడి, పులావ్‌, మసాలా కర్రీ, బిర్యానీ ఇంకా హల్వా వంటి వెరైటీ వంటకాలను చేసుకోవచ్చు. అయితే క్యారెట్లను తినడంలో చాలా మందికి  కూడా ఒక సందేహం ఉంటుంది.అదేమిటంటే.. క్యారెట్లను నేరుగా పచ్చిగానే తింటే మంచిదా.. లేక జ్యూస్ తాగితే మంచిదా అని అనుకుంటారు.ఈ క్యారెట్లను జ్యూస్‌లా కాదు. పచ్చిగా నేరుగా అలాగే తింటేనే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యారెట్లను పచ్చిగా తినేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వీటిని నోట్లో బాగా నమిలి తింటారు. అందువల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది పొట్టకు చాలా బాగా మేలు చేస్తుంది.


ఇది పొట్టలోకి వెళ్లడం వల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగు పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉంటే ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే క్యారెట్లను తినేందుకు సమయం పడుతుంది కాబట్టి మన ముఖానికి చక్కని వ్యాయామం అవుతుంది. కాబట్టి క్యారెట్లను పచ్చిగానే తినడం చాలా మంచిది.అయితే కొందరు మాత్రం క్యారెట్లను ఉదయం పూట తింటుంటారు.ఆ సమయంలో ఆఫీసులకు ఇంకా బయటకు పనికి వెళ్తారు. కాబట్టి ఉదయం సమయంలో క్యారెట్లను తినాలనుకుంటే సమయం ఉండదు కనుక.. అలాంటప్పుడు జ్యూస్ తాగితేనే చాలా బెటర్‌. ఎందుకంటే వారికి సమయం ఆదా అవుతుంది. సమయం ఉంది తింటామనుకునేవారు నేరుగా అలాగే పచ్చిగానే వాటిని తినేయాలి. టైమ్ లేదని భావిస్తే జ్యూస్ చేసుకొని తాగాలి.ఇక ఇలా క్యారెట్లను ఎవరికి వారు తమ సౌకర్యానికి అనుగుణంగా తీసుకోవచ్చు. కానీ ఎలా తీసుకున్నా కానీ ఈ క్యారెట్ల వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. వీటితో చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: