హిందూ సంప్రదాయంలో పసుపుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు.అటు ఆయుర్వేదికంగాను,ఇటు పూజల్లో ప్రతమ స్థానంలో నిలుస్తుంది పసుపు.స్త్రీలకు పసుపు కుంకుమ ఎంతో సోభాగ్యన్ని ఇస్తాయి.అలాంటి పసుపు రోజూ రాసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అందరికీ తెలుసు,కానీ చాలామందికి సమయం లేక దాని ఆయుర్వేదిక్ గుణాలను కూడా కోల్పోతున్నారు.అలా సమయం లేనివారు సాధారణ నీళ్లతో మొహం శుభ్రం చేసుకున్నట్టే,పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల కూడా అటువంటి ఫలితాలనే పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.ఆ పసుపు నీళ్లతో ఎలా శుభ్రం చేసుకోవాలో,వాటి ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి..

పసుపులో యాంటీ ఫంగల్ ,యాంటీసెప్టిక్  మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.అంతే కాక సోడియం,ఐరన్,పొటాషియం, విటమిన్లు,ఐరన్ ఇందులో పుష్కలంగా లబిస్తాయి.

పసుపు నీళ్లు అప్లై చేసుకునే విధానం..

ముందుగా స్టవ్ మీద ఓ గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు వేసి, అందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇవి బాగా మరిగి ఆఫ్ గ్లాస్ అయిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి.ఆ తర్వాత ఈ నీటితో  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా ముఖాన్ని రోజు శుభ్రం చేసుకోవడం వల్ల ముఖముపై ఉన్న మృత కణాలు తొందరగా తొలగిపోవడమే కాకుండా,ముఖము బంగారు చాయని సంతరించుకుంటుంది.పసుపును అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి దారితీస్తుంది.

దీనితో వృద్ధాప్య చాయలను కూడా దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.ఎవరైనా అధిక మొటిమలతో మొహం గుంటలు పడినట్టు ఉంటే వారికి పసుపు నీటితో మొహం శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల మొహంపై ఉన్న కొత్త కణాలను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

చర్మంపై దద్దుర్లు,మంట కూడా ఉపశమనం లభిస్తుంది, ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది,కాబట్టి ఇది చర్మం వాపు,చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది.ఇంకెందుకు ఆలస్యం చిటికలో తయారు చేసుకునే చిట్కా అని ఫాలో అయి, బంగారు వర్ణంలాంటి ముఖాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: