మరి చికెన్ తిన్నప్పుడు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. పాలు – చికెన్‌తో కలిసి తాగితే ప్రమాదమే!
చాలామందికి ప్రతిరోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేదా రాత్రి భోజనం తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ చికెన్ తిన్న వెంటనే లేదా చికెన్‌తో పాటు పాలు తాగడం అస్సలు మంచిది కాదు. చికెన్ మరియు పాలు రెండింటి జీర్ణక్రియ విధానం వేరు. చికెన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాలు మాత్రం త్వరగా జీర్ణమవుతాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దీని వల్ల
చర్మంపై దురద,దద్దుర్లు,అలెర్జీ సమస్యలు,అజీర్ణం,వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అలెర్జీ సమస్యలు ఉన్నవారు, సున్నితమైన చర్మం కలిగినవారు చికెన్ తిన్న తర్వాత పాలు తాగడం పూర్తిగా నివారించాలి.
2. చేపలు – చికెన్‌తో కలిపి తినకూడదు
ఇంట్లో లేదా హోటళ్లలో ఒక్కోసారి చికెన్‌తో పాటు చేపల కూరలు కూడా వండుతుంటారు. కొన్ని సందర్భాల్లో భోజనాల్లో అన్ని రకాల నాన్‌వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. అలా అని చికెన్ మరియు చేపలను ఒకేసారి తినడం మంచిది కాదు. చికెన్, చేపలు రెండింటిలోనూ అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. ఒకేసారి ఈ రెండింటిని తీసుకుంటే శరీరానికి అవసరమైనంతకంటే ఎక్కువ ప్రోటీన్ చేరుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు,కడుపు ఉబ్బరం,అలెర్జీలు, చర్మ సమస్యలు (తెల్ల మచ్చలు, దద్దుర్లు)
వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం, చేపలు మరియు మాంసాహారం కలిపి తినడం అనారోగ్యానికి కారణమవుతుందని చెబుతారు. అందుకే వీటిని వేరువేరుగా తీసుకోవడం ఉత్తమం.
3. పెరుగు – చికెన్ తర్వాత తింటే జీర్ణ సమస్యలు
భారతీయ భోజనంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే తృప్తి ఉండదు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తింటే చల్లదనం కలుగుతుందని భావిస్తారు.కానీ చికెన్ తిన్న తర్వాత పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ వేడి స్వభావం కలిగిన ఆహారం కాగా, పెరుగు చల్లదనం కలిగినది. ఈ రెండు విరుద్ధ స్వభావాల ఆహారాలు కలిసినప్పుడు జీర్ణక్రియలో అవాంతరాలు కలుగుతాయి. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, నిద్రలేమి, చర్మ సమస్యలు
వచ్చే అవకాశం ఉంది. అందుకే చికెన్ తిన్న రోజున పెరుగును దూరంగా ఉంచడం మంచిది.
గమనిక: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా సందేహాలు ఉంటే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి అనే విషయం పాఠకులు గుర్తుంచుకోవాలి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి