నేడు 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. ప్రపంచంలోని ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఒక రోజు ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' ప్రవేశపెట్టారు. సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మిగతా వారిలో సానుకూలతలు పెంచడం ఇంకా అలాగే ప్రతి దేశం తమ పౌరులు ఆనందంగా ఉండేలా చూసుకోవడం ఈ రోజు  యొక్క ముఖ్య లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆనందానికి బదులు ప్రపంచంలో కోపం, బాధ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సంవత్సరం కూడా మార్చి 20 వ తేదీన 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' నిర్వహిస్తోంది. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో సంతోషంగా ఉండటమే మానవుని ప్రాథమిక లక్ష్యం అని,ఈ వేడుక చేసుకోవడం ద్వారా ఎంతో ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని ఈ రోజును కేటాయించింది.నిజానికి ఒక రోజంతా కూడా సంతోషంగా ఉండి నవ్వుతూ, మంచి వాతావరణంలో గడిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. 2013 వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి తొలిసారి 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' నిర్వహించింది. సలహాదారు జేమీ ఇలియన్‌ ఈ ఐడియాను ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ దేశాలు 'క్యాప్టలిజం'కు బదులు 'హ్యాపీటలిజం'పై దృష్టి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి సాధించవచ్చని ఆయన భావించారు. 


అందుకు ఐక్యరాజ్య సమితి కూడా సమ్మతి తెలిపింది. 'యాక్షన్‌ ఫర్‌ హ్యాపీనెస్‌', 'హ్యాపీనెస్‌డే.ఓఆర్‌జీ' వంటి వివిధ రకాల కంపెనీలు దీనికి సహకారం అందించడంతో అది కార్యరూపం దాల్చింది. ఈ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా సైట్స్ ద్వారా ప్రజలు ఏ పరిస్థితుల్లో తాము సంతోషంగా ఉంటామో వెల్లడిస్తారు.ఇంకా తమ సంతోషంలో చుట్టుపక్కలి వారిని ఎలా భాగస్వాముల్ని చేస్తారో కూడా చెబుతారు. అలా చేయడంతో మంచి భవిషత్తు అనేది ఎలా సొంతమవుతుందో వివరిస్తారు.మనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కష్టాలు ఎదురైనా  మొహం మీద మాత్రం చిరునవ్వు చెక్కుచెదరనివ్వకూడదు. ఎందుకంటే ఇదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇక దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కూడా ఇదే మాట నమ్ముతారు. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటేనే ఎటువంటి పెద్ద సమస్య అయినా కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుందని అంటారు. అందుకే ఆమె మోము మీద ఎప్పుడు కూడా చెరగని చిరునవ్వు ఉంటుంది.కాబట్టి ఎన్ని బాధలు వున్న ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ పాజిటివ్ గా ఉందాం. ఎల్లప్పుడూ నవ్వుతూ బ్రతికి వున్నన్ని రోజులు నవ్వుతూ గడిపేద్దాం. అందరికి హ్యాపీ హ్యాపీనెస్ డే..

మరింత సమాచారం తెలుసుకోండి: