సాధారణంగా యాలుకలను వంటల్లో మంచి సువాసన కోసం మాత్రమే వాడుతారు. వీటిని ఎక్కువగా పండరసాలలో,స్వీట్స్ లోను,బిర్యానీ వంటి వాటిల్లో యాలకులను ఎక్కువగా వాడుతుంటారు.యాలకులు మంచి ఫ్లేవర్ ని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.విషాన్ని మింగిన వారు కూడా,యాలకులు తినడం వల్ల విషానికి విరుగుడు కలుగుతుందని పూర్వం పెద్దలు చెబుతుండేవారు.ఇన్ని ఔషధగుణాలు కలిగిన యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


యాలకలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి.మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.యాలకలు ఒకటి లేదా రెండు రోజూ తినడం వల్ల, అందులోని సువాసనకు డిప్రెషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.పాలలో చిటికెడు యాలకలు పొడి వేసుకుని త్రాగటం వల్ల,శరీర మెటబాలిజంని మెరుగుపరుస్తాయి.భోజనం తర్వాత యాలకలు తినడం వల్ల,జీర్ణక్రియ సక్రమంగా జరిగి,తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

అధిక బీపీతో బాధపడేవారు,బీపి కంట్రోల్ అవ్వాలంటే రోజూ ఏదోక రూపంలో యాలకలను తీసుకోవడం ఉత్తమం.సంతాన సమస్యలు ఎదుర్కొనేవారు యాలకలు పొడి తరుచూ తీసుకోవడం వల్ల,పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు చాలా బాగా సహాయపడతాయి.

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో గ్రీన్ యాలుకలు చాలా బాగా పనిచేస్తాయి.మరియు యాలకలు తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ క్రమంగా ఉండి డయాబెటిస్ సమస్యను కూడా తగ్గిస్తుంది.మరియు గుండెకు రక్తాన్ని సరైనా విదంగా పంపిణి చేసి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చెడుకొలెస్ట్రాల్ కరిగించడంలో యాలకలు చాలా బాగా ఉపయోగపడతాయి.త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు గోరువెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి,అర అంగుళం అల్లము వేసుకొని టీ కానీ,పాలల్లో కానీ వేసుకొని త్రాగటం ఉత్తమం.మరియు లోపలి నుంచి వచ్చే దుర్వాసన,బ్లోటింగ్, ఇంటెస్టినల్ గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గించవచ్చు.అంతే కాకుండా నోటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి,మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తాయి.కావున మనం తినే ఆహారాలపై యాలకలుపొడి వేసుకొని తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: