బొప్పాయిని “ఫ్రుట్స్ అఫ్ ఏంజెల్స్” అని అంటారు. పూర్వ కాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తునారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్లు, పోష‌కాలు ఈ పండ్ల వ‌ల్ల మ‌నకు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే గుణాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉంటాయి. అయితే కేవ‌లం బొప్పాయి పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకుల వల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు క‌లుగుతాయి. బొప్పాయి చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు.

 

విటమిన్ ఎ, కే, ఇ, సి, విటమిన్ బి కాంప్లెక్సులు బీ1, బీ2, బీ3, బీ5 మరియు బీ9 వంటి అనేక పోషకాలు బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి మరియు పేపైన్ మరియు చిమ్పోపాన్ వంటి ఎంజైమ్లు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మ‌రి ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు. ఆస్తమ, హే ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే.ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజీం ఉంటుంది.ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది. ఇది సమస్యలు ఇంకా పెంచుతుంది.

 

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే.కాని మరీ తక్కువగా ఉండటం మంచిది కాద. బొప్పాయి షుగర్ లెవల్స్ పడిపోయేలా చేస్తుంది నిజమే కాని ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ మరీ టూ మచ్ గా పడిపోవచ్చు. అలాగే బొప్పాయి అధికంగా తింటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఏ ఆహార పదార్థమైన మితంగానే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకుంటే ఏదైనా ప్రమాదమే. బొప్పాయి ముఖ్యంగా గర్భిణీలు తినకూడదు. దీనివలన కడుపులో బిడ్డకి ప్రమాదం.

మరింత సమాచారం తెలుసుకోండి: