పిల్లల ముద్దుముద్దు మాటలు తల్లిదండ్రులను చాలా ఆనందపరుస్తాయి. మరి అలాంటి పిల్లలు సాధారణంగా మాట్లాడాల్సిన వయస్సులో మాట్లాడకపోతే ఏం చేయాలి. అసలు పిల్లలు సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా.. వారి స్వరం సరిగ్గానే ఉందా లేదా.. వారికి మాటలు సరిగ్గానే వస్తున్నాయా లేదా.. ఇలాంటి అనుమానాలు కలగడం సహజం.

 

ఆ సమయంలోనే పిల్లలకు స్పీచ్ అసెస్మెంట్ చేయించాలి. ఈ స్పీచ్ ఎసెస్మెంట్ లో చాలా రకాలు ఉంటాయి. మనం మన స్వరాన్ని ఉచ్చరణగా మారుస్తాం. అందుకే.. ఎలా పలుకుతున్నారు అనేదాన్ని ప్రనౌన్సియేషన్ ఎసెస్ మెంట్ ద్వారా నిర్ధారిస్తారు. అలాగే ఎంత ధాటిగా మాట్లాడుతున్నారు.. అనేదాన్ని ఫ్లూయన్సీ ఎసెస్ మెంట్ ద్వారా నిర్థరిస్తారు.

 

మరి ఈ స్పీచ్ ఎసెస్ మెంట్ ఎవరికి చేయించొచ్చు. దీనికేమైనా వయస్సు నిబంధనలు ఉన్నాయా అంటే అదేమీ లేదు. ఎవరికైనా చేయించవచ్చు..అంతే కాదు ఇది అందరికీ అవసరమే.. కేవలం మాటలు సరిగ్గా రాని ప్రత్యేక పిల్లలకే అవసరం అన్నది సరికాదు. అసలు అంతా బాగానే ఉందా లేదా అనేదాని నిర్థరణ కోసం ఈ స్పీచ్ థెరపీ చేయించొచ్చు.

 

కొందరు పిల్లలకు సరిగ్గా మాటలు రాకపోతే.. చూద్దాంలే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఐదేళ్ల వరకూ మాటలు రాకపోతే అప్పుడు చూద్దాం అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే.. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స ప్రారంభించొచ్చు. ఈ స్పీచ్ ఎసెస్మెంట్ ఏ వయస్సువారికైనా చేయొచ్చు. ఏడాదిన్నర పిల్లలకు కూడా చేయించొచ్చు.

 

అంతే కాదు..ఈ స్పీచ్ అసెస్మెంట్ పెద్దలకూ పనికొస్తుంది. ఎలాగంటే.. ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పడు మన స్వరం చాలా కీలకం. మన స్వరం బావుందా.. తడబాటు ఉందా.. సరిగ్గా మాట్లాడుతున్నామా లేదా.. అనే విషయాలు ఈ స్పీచ్ ఎసెస్మెంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ స్పీచ్ ఎసెస్మెంట్ థెరపీలో అన్ని జాగ్రత్తలు తీసుకుని మీకు ఫలితాలు అందిస్తారు. ఇంకా ఏమైనా సందేహాలుంటే.. మీరు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మా నెంబర్ 9100181181. 

మరింత సమాచారం తెలుసుకోండి: