జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సొంతం చేసుకోవాలంటే కాలాన్ని బట్టి నడుచుకోవాలి. సమాజ పరిస్థితులను, సమయాన్ని బట్టి నడుచుకుంటూ జాలి, దయ, మంచితనం లాంటి లక్షణాలు ఉంటే విజయం సొంతమవుతుంది. జీవితంలో విజయం సాధించకపోవడానికి, ఎదగలేకపోవడానికి ఒక రకంగా చెడు స్నేహం కూడా కారణమవుతుంది. చెడు స్నేహాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. 
 
జీవితంలో ఎటువంటి భేదాలు చూడకుండా మంచివారితో స్నేహం చేస్తే విజయం సులభంగా సొంతమవుతుంది. చెడు అలవాట్లు, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు అంత పెరుగుతాయి. జీవితంలో వీలైనంత వరకు ఇతరులపై ఆధారపడకూడదు. మన అవసరాల కోసం మనం నేర్చుకున్న పనులు జీవితంలో అనేక సందర్భాల్లో మనకు ఉపయోగపడతాయి. కష్టాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేస్తే విజేతలుగా నిలవడం అసాధ్యమేమీ కాదు. 
 
జీవితంలో ఎవరిపై అతి ప్రేమ, అతి విశ్వాసం పనికిరాదు. ఈ రెండూ నాశనానికి, మోసానికి దారి తీస్తాయి. ఎలాంటి సమయంలోనైనా అర్ధ జ్ఞానం వల్ల లాభాల కంటే నష్టాలు కలిగే అవకాశం ఎక్కువ. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలుపెట్టడం మంచిది. ఏదైనా సాధించాలంటే మొదట ఆ పనిపై అమితమైన ఆసక్తిని ఏర్పరచుకోవాలి. మంచి వ్యూహాలతో చేపట్టిన పనిని సక్రమంగా పూర్తి చేయగలిగితే విజయం సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: