పెళ్లి అంటే.. వేద మంత్రాలు, తలంబ్రాలు, అక్షింతలు, పెళి పందిరి ఎంత ముఖ్యమో ఒక‌రిపై ఒక‌రికి నమ్మకం, విశ్వాసం ఉండ‌డం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు కుటుంబ వ్యవస్థకు మూలం ఏదైనా ఉందంటే అది పెళ్లి.. అందుకే పెళ్లి అంటే అందరూ నూరేళ్ల పంట అన్నారు. అంతటి గొప్ప ప్రాధాన్యత వివాహ బంధానికి ఉంది. అయితే పెళ్లి అంటే మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కాదు.. మంచి జీవిత భాగస్వామివి కావడం. సంతోషం పొందడానికి పెళ్లి చేసుకోవ‌డం క‌న్నా సంతోషం ఇవ్వడానికి పెళ్లి చేసుకోవాలి. 

 

అయితే పెళ్లికి ముందు కొన్ని విష‌యాలు పంచుకోకుంటే.. ఆ త‌ర్వాత ఎన్నో క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంది. అందులో ముందుగా.. ఎఫైర్స్‌. గతంలోని బంధాలుగానీ, శారీరక సంబంధాలు గానీ పెళ్ళి చేసుకోబోయే వాళ్ళ దగ్గర దాచే వాటిలో మొట్టమొదటివి. అది ఒక చిన్న ఎఫైర్ అయ్యుండచ్చు. మీరు బాగా ఇష్టపడిన బంధం కావచ్చు. కానీ, అది మీరు మీ జీవిత భాగస్వామికి చెప్ప‌కుంటే చాలా బాధ‌ప‌డ‌తారు. ఎందుకంటే.. అలాంటి ఎఫైర్లు ఇత‌రుల ద్వారా తెలియ‌డం క‌న్నా.. మీ ద్వారానే తెలిస్తే మంచిది. అలాగే ఆర్ధిక విషయాల్లో నిజాయితీగా లేకపోతే మీరు వారికి ద్రోహం చేసినట్టే లెక్క. 

 

ముఖ్యంగా మీకేమైనా అప్పులున్నా, లోన్స్ కట్టవలిసి ఉన్నా మీరు మీ కాబోయే జీవిత భాగస్వామికి ఖ‌చ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గాలేని ఆర్ధిక పరిస్థితి వివాహ బంధాన్ని కూల్చేస్తుంది. అదేవిధంగా, చాలా మంది వారి వ్యసనాల గురించి జీవిత భాగస్వామితో చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ,  ఏ వ్యసనమైనా ఒక బంధాన్ని బలహీనపరుస్తుంది. వివాహం దానికి మినహాయింపేమీ కాదు. మద్య వ్యసనమైనా, శృంగార పరమైన వ్యసనాలైనా మీరు దాచకుండా పార్టన‌ర్‌కు చెప్పి తీరాలి. ఎందుకంటే.. ఆ విష‌యాలు పెళ్లి త‌ర్వాత తెలిస్తే మాత్రం ర‌చ్చ ర‌చ్చ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: