మనం దాహం తీర్చుకునేందుకు నీరు తాగుతాము.. అయితే.. కొన్ని సమయాల్లో అయితే ఎన్ని నీళ్లు తాగినా కూడా అస్సలు దాహం అనేది తీరదు. సాధారణంగా నోటిలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ మందగించినప్పుడు మన గొంతు పొడిగా మారుతుంది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. వీటిలో ముఖ్యంగా.. నీటిలో ఎక్కువ మొత్తంలో ఫ్లోరైడ్ ఉండటం, శరీరంలో నీరు లేకపోవడం లాంటి కారణాలు ఉండవచ్చు. అయితే చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటుంటారు. అందుకే నోరు పొడిబారడానికి చికిత్స అవసరం. పొడి గొంతు సమస్యను తగ్గించడానికి కొన్ని హోమ్ రెమెడీలను పాటించండి. ఇక అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మీ నోరు పొడిబారినప్పుడు కొబ్బరి నీరు తీసుకోండి.. దీనివలన డీహైడ్రేషన్ సమస్యను చెక్ పెట్టడంతోపాటు.. గొంతు పొడిబారడం లాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు.నోరు పొడిబారడం సమస్య మరీ ఎక్కువవుతుంటే యాలకులు తీసుకోండి. ఏలకులు తీసుకోవడం ద్వారా నోరు పొడిబారడం సమస్యను అధిగమించవచ్చు.


నోరు పొడిబారడం లాంటి సమస్యను కలబందతో అధిగమించవచ్చు. దీని కోసం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 టీస్పూన్ల కలబంద రసం తీసుకోండి. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.గొంతు పొడిబారడం సమస్య తగ్గాలంటే నిమ్మరసం, తేనె కలిపి తీసుకోండి. నిమ్మ ఇంకా తేనె తీసుకోవడం ద్వారా నోరు పొడిబారడం సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం 1 గ్లాసు నీటిని కొద్దిగా వేడి చేయండి. అందులో కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలపాలి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి. ఇది నోటిలో లాలాజలాన్ని సృష్టిస్తుంది. ఇది పొడి నోరు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.నోరు ఎండిపోయినప్పుడు, లేదా గొంతు పొడిబారినప్పుడు సోంపు నీళ్లు తాగాలి. దీని వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. దీని కోసం 1 గ్లాసు నీరు తీసుకోండి. దానికి 1 టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ పంచదార వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని చల్లారనివ్వాలి. అనంతరం తాగితే నోరు పొడిబారడం సమస్య తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: