ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు లేదా అదుపులో ఉంచుకునేందుకు పలు పోషకాహారాలను తీసుకుంటున్నారు. ఆ కోవలోనే కొందరు బరువును నియంత్రించేందుకు కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటమే కాదు.. పోషక విలువలు కూడా ఎక్కువే. సహజసిద్దమైన గ్రీన్ టీ.. రోగ నిరోధకశక్తిని పెంచడమే కాదు.. మెటబాలిజం పెరగడంలో సహాయపడుతుంది. అటు మెదడు కూడా చురుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. మరి ఇంతటి పోషకాల నిధిని ఎప్పుడెప్పుడు తాగాలన్న విషయం చాలామందికి తెలియదు. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటే.. మరికొందరు భోజనం చేశాక.. ఇంకొందరు రాత్రి వేళల్లో గ్రీన్ టీ తాగుతుంటారు. మరి గ్రీన్ టీ ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం..


పొద్దున్నే వ్యాయామం చేసిన తరువాత మరీ పొద్దున్నే కాకుండా ఉదయం 11-12 గంటల మధ్య ఈ గ్రీన్ టీని తీసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా అలాగే మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు.. సాయంత్రం అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక గంటకు.. అటు రాత్రి పదుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యం మీద అతి శ్రద్ధ వున్న కొంతమంది మహానుభావులు మాత్రం చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి గ్రీన్ టీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: