చాలా మంది కూడా నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం వస్తుంది.అప్పుడు నొప్పి కూడా భయంకరంగా ఉంటుంది.ఎక్కువగా కూర్చునేటప్పుడు ఇంకా నడిచేటప్పుడు ఈ శబ్దం వస్తుంది. ఈ సమస్యనే జాయింట్ క్రిపిటేషన్ అంటారు.ఆ కీళ్ల మధ్య ఉండే జిగురు తగ్గిపోవడం వల్ల నడిచేటప్పుడు ఇలా శబ్దం అనేది వస్తుంది. ఈ శబ్దం రావడంతో పాటు విపరీతమైన నొప్పి, వాపు కూడా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు, వాపులు ఇంకా అలాగే నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రావడం వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అది ఖచ్చితంగా మరింత ఎక్కువయ్యి జీవిత కాలం వేధించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.మోకాళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నుండి శబ్దం రావడం వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ రాత్రి ఒక టీ స్పూన్ మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి.


ఆ మరుసటి రోజూ ఉదయం ఈ మెంతులను నీటితో సహా ఉడికించి ఆ తరువాత  వడకట్టుకుని నీటిని తాగాలి. ఆ తరువాత గింజలను నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నుండి శబ్దం రావడం ఈజీగా తగ్గుతుంది ఇంకా అలాగే మోకాళ్ల నొప్పులు, వాపులు కూడా ఈజీగా తగ్గుతాయి. అయితే ఈ మెంతులను వాడడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు వీటిని వాడకూడదు. అలాగే వేడి వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే వారు కూడా ఈ మెంతులను అస్సలు వాడకూడదు. అలాగే మోకాళ్ల సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలల్లో చిటికెడు పసుపును కలిపి తాగాలి.ఇక ఇలా చేయడం వల్ల మోకాళ్లకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే శరీరానికి తగినంత క్యాల్షియం లభించి ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.ఇంకా అంతేకాకుండా నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం, నొప్పి కూడా రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: