పిల్లల ఎగ్జామ్స్ మొదలైన తర్వాత, పిల్లలకే కాక వారి తల్లిదండ్రుల్లో కూడా గాబరా మొదలవుతుంది. ఈ సమయంలోనే పిల్లలు ఒత్తిడికి గురై,తగిన ఆహారాలు తీసుకోక,నిద్రలేమి కారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటి సమయంలోనే వారి తల్లి పిల్లలే ఏకాగ్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, వారు ఎగ్జామ్స్ లో చురుగ్గా పాల్గొంటారు. మన ఆహారం కూడా మన జ్ఞాపక శక్తిని నిర్ణయిస్తుందని,ఆహార నిపుణులు చెబుతుంటారు.అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 బ్రేక్ ఫాస్ట్..
పిల్లలు చదువులో పడిపోయి, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. దానివల్ల వారి మెదడు పనితీరు మందగించి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ సమయంలో  ప్రోటీన్ ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల వారికి తక్షణ శక్తి అంది,ఎగ్జామ్స్ లో చురుగ్గా పాల్గొంటారు.

 పండ్ల రసాలు..
ఎగ్జామ్స్ వేసవికాలంలోనే మొదలవుతాయి.కాబట్టి పిల్లలు తొందరగా డిహైడ్రేషన్ గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున వారికి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న  దోసకాయ,పుచ్చకాయ వంటి పండ్లను లేదా పండ్ల రసాలను ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఇవి తొందరగా డిహైడ్రేషన్ పోగొట్టడమే కాకుండా, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. దీనివల్ల మలబద్ధకం, అజీర్తి సమస్యలు తొలగి చదువుపై కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.

కాఫీ, టీ..
 పిల్లలకు నిద్ర రాకూడదని కాఫీ టీ లను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ అందులో ఉన్న కెఫెన్ మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. దీనితో పిల్లల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

 మసాలాలు..
వేసవికాలంలో జీర్ణక్రియ సక్రమంగా జరగదు.కావున ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారాలు ఇవ్వకపోవడమే చాలా ఉత్తమం. ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారాలు ఇవ్వడం వల్ల, అజీర్తి సమస్యలు తలెత్తి, పొట్టనొప్పి, వంటి సమస్యలు పెరుగుతాయి. పిల్లల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది.

వీటన్నిటితో పాటు పిల్లలు ఎగ్జామ్స్ అంటే గాబరా పడకుండా వారికి తల్లిదండ్రులు ధైర్యం చెప్పి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: