నల్లేరు తీగలాగా సన్నగా ఉన్నప్పటికీ,దానివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు కావాల్సిన పోషకాలని అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నల్లేరు టౌన్ మరియు సిటీలో ఉన్న వారికి అంతగా తెలియకపోవచ్చు.కానీ పల్లెల్లో ఉన్నవారికి దాని ఔషధ గుణాలు వారి పెద్దలు చెబుతూనే ఉంటారు.

నల్లేరును సాధారణంగా వజ్రవల్లి,చతుర్దాత, ఆస్తిసంధానాన్ని పిలుస్తూ ఉంటారు.ఆ తీగల రసం తాగడం వల్ల,మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గుతాయి అంటే ఆశ్చర్య పోవాల్సిందే. అటువంటి నల్లేరు వల్ల ఇతర ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నల్లేరు చూడటానికి తీగలాగా కణుపులు,కణుపులుగా ఉంటుంది.కనుపులు దగ్గర చిన్న చిన్న ఆకులు ఉంటాయి.ఇది మల్లెతీగ పెరిగినట్టు తీగలు తీగలుగా పెరిగి అల్లుకుపోతుంది.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,క్యాల్షియం,విటమిన్ సి,విటమిన్ బి,సెలీనియం,క్రోమియం మరియు కెరోటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.

పూర్వం రోజుల్లో కాలు జారినప్పుడు కాళ్లు విరగడం లేదా కాళ్లు బెనకడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వెంటనే ఆసుపత్రులకు వెళ్లకుండా నల్లేరు ఆకు రసాన్ని వేసి కట్టు కట్టేవారు.దీనితో నొప్పికి వెంటనే ఉపశమనం కలిగి,క్రమంగా విరిగిన కాలు కూడా సరిగా అయిపోతుందట.మరియు కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులతో బాధపడేవారు రోజు నల్లేరు రసాన్ని తాగడం వల్ల అందులోని కాల్షియం వారి ఎముకలను దృఢంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

సాధారణంగా ఏదైనా నొప్పి వేస్తే ఆస్ప్రిన్ మాత్రలు వేసుకుంటూ ఉంటాము.కానీ నొప్పి అప్పటికప్పుడు తగ్గినా మళ్లీ వస్తూ ఉంటుంది.అలాంటి వారికి నల్లేరు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.నల్లేరు రసాన్ని రెండు స్పూన్ల మోతాదులో తరచూ తీసుకోవడం వల్ల ఎలాంటి నొప్పికైనా నివారణ కలుగుతుంది

మరియు ఎవరైనా అనిమీయాతో బాధపడుతూ ఉంటే, అలాంటివారికి నల్లేరు రసాన్ని రోజు ఇవ్వడం వల్ల,కొత్త రక్తకణాలు వృద్ధి చెంది,రక్తహీనత తగ్గుతుంది.

అంతేకాక మహిళల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత  వచ్చే మోనోపాజ్ సమస్యలను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఇందులో వున్న అధిక పైబర్ గుణాలు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: