ఇప్పుడున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది బరువు పెరిగి,రకరకాల రోగాల బారిన పడుతూ ఉన్నారు.ఆ బరువును తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతూ ఉంటారు.మన జీవనశైలి మార్చుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గొచ్చు అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన నిద్ర..

నిద్ర అనేది మన జీవితంలో చాలా రోగాలు రాకుండా కాపాడుతుంది.బరువు తగ్గాలి అనుకునేవారు సరైన నిద్ర సమయాలు పాటించాల్సిందే.తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియ రేటు పెరిగి శరీరం యాక్టివ్ స్టేజ్ లోకి వస్తుంది దీనితో జీర్ణక్రియ శక్తి పెరిగి,శక్తిని రిలీజ్ చేస్తుంది.అంతేకాక కావున బరువు తగ్గడానికి చాలా హార్మోన్ కూడా కారణం అవుతాయి.నిద్ర అనేది హార్మోనల్ చేంజెస్ కూడా ఉపయోగపడుతుంది.కావున కనీసం ఎనిమిది గంటలు నిద్ర సమయం పాటించడం తప్పనిసరి.

గోరు వెచ్చని నీళ్లు..

ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లను ఒక గ్లాస్ నెమ్మదిగా చప్పరిస్తూ తాగడం వల్ల,మన గొంతులో కొన్ని రకాల మంచి ఎంజైమ్ లు పొట్టలోకి వెళ్లి,జీర్ణక్రియ రేటుని పెంచుతుంది.మనం తిన్న ఆహారం తాలూకు టాక్సిన్స్ అన్నీ బయటకు పంపి,చెడు కొవ్వులు పేరుకుపోకుండా ఉపయోగపడతాయి.దీనితో కూడా తొందరగా బరువు తగ్గవచ్చు.
 
వ్యాయామాలు చేయడం..

ఈ ఉరుకులు పలకలు జీవితంలో చాలామందికి సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల,అధికబరువు పెరుగుతూన్నారు.మనకి మనము అరగంట సమయం ఉపయోగించి యోగా కానీ,వ్యాయామాలు చేయడం వల్ల,290 క్యాలరీలు బర్న్ అవుతాయని ఒక పరిశోధన ద్వారా తేలింది.కావున పిల్లలు,పెద్దలని తేడా లేకుండా, ఒక అరగంటసేపు యోగ సాధన చేయాలి.ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.కావున యోగసాధన చేయడం చాలా మంచిది.

సూర్యరశ్మి..

ఉదయం వచ్చే సూర్యరశ్మిలో కనీసం అరగంట సేపు ఉండడం వల్ల,జీవక్రియా రేటు పెరిగి,బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

ప్రోటీన్-రిచ్ ఫుడ్..

ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఎక్కువ ప్రొటీన్లు వున్న ఆహారం తీసుకోవడం వల్ల,తక్షణ శక్తి వచ్చి,రోజంతా తాజాగా,శక్తివంతంగా ఉంటారు.ప్రోటీన్ అధికంగా ఉండే టిఫిన్ కోసం గుడ్లు,మొలకెత్తిన బీన్స్ వంటివి ఎంచుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: