అయితే మొదటి స్థానంలో పుణే, రెండో స్థానంలో నవీ ముంబయి, మూడు, గ్రేటర్ ముంబయి, నాలుగు తిరుపతి, అయిదు చంఢీఘర్ నిలిచాయి. ఇందులో తొమ్మిదో స్థానంలో విజయవాడ నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల కంటే కూడా నివాసయోగ్య నగరాల్లో కూడా ఈ నగరాలు నిలిచాయి. అయితే హైదరాబాద్, కోల్ కతా, ఢిల్లీ నగరాల్లో లేనిది ఇక్కడ ఏముంది.. అంటే సామాన్య ప్రజలు కూడా అతి తక్కువ ఖర్చుతో జీవించే అవకాశం ఉంది.
ఆర్థిక పరంగా, సామాజిక పరంగా నివాసయోగ్యంగా ఉండటం కారణం. రెండు నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం ఇక్కడ సానుకూల అంశం. ఒకప్పుడు అందరికీ నివాసయోగ్యంగా హైదరాబాద్, వైజాగ్ నగరాలు ఉండేవి. కానీ ప్రస్తుతం మారిన కాల మాన పరిస్థితుల్లో మెట్రో నగరాలుగా మారి హైదరాబాద్ లో సామాన్యులు జీవించడం అనేది కష్టంగా మారింది.
పెరిగిన ధరలు, అద్దెలు ఎక్కవ కావడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. దాదాపు రూ. 20 వేలు సంపాదించిన రూమ్ రెంట్ కే దాదాపు రూ. 7 నుంచి 8 వేలు పెట్టాల్సి రావడం ఇబ్బంది కలిగించే అంశం. కానీ తిరుపతి, విజయవాడలో సామాన్యుడు జీవించడానికి, కోటీశ్వరుడు జీవించే లగ్జరీ లైఫ్ గడిపే అవకాశాలు ఉండటం కలిస్తోంది. దీని వల్లే కేంద్రం చేపట్టిన నివాస యోగ్య నగరాల్లో ఈ రెండు చోటు దక్కించుకున్నాయి. మరి మరింత మౌలిక సదుపాయాలు కల్పిస్తే విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించి అత్యంత అద్భుత నగరాలుగా మార్చవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి