రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ఎక్స్ప్రెస్ హరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని స్టాండప్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు వంటి తదితర టీవీ చానల్స్ లో పలు ప్రోగ్రామ్స్ లలో కనిపిస్తున్న హరి, గతంలో బిగ్ బాస్ బ్యూటీగా పేరు సంపాదించిన అషు రెడ్డి తో ప్రేమలో ఉన్నారనే విధంగా ఆ మధ్య ప్రచారమైతే జరిగింది. అంతేకాకుండా ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చారు.


అంతేకాకుండా అషు రెడ్డి బైక్ గిఫ్ట్ గా ఇవ్వడం వంటివి చూసి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారాన్ని అందరూ నమ్మేశారు. అయితే అదంతా కూడా కేవలం షో కోసమే అలా చేశారని ఆ తర్వాత బయటపడింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్న ఎక్స్ప్రెస్ హరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టారు.


తాను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించానని అయితే ఆ అమ్మాయి తనని చివరికి మోసం చేసిందని, ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను సూసైడ్ చేసుకోవాలని ఆలోచన కూడా తనకి వచ్చిందని, అలా ఒక రోజు తనకి 96 సార్లు కాల్స్ చేశాను 97వ సారి ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అంటూ మాట్లాడింది. అలా మరొక రోజు విశాఖపట్నం కి వస్తాను నన్ను కలవమని చెప్పింది. ఆమె కోసమని గంటల తరబడి ఆమె చెప్పిన లొకేషన్లో వెయిట్ చేశాను తీరా చూస్తే ఆమె అక్కడికి రాలేదు. ఆమె కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను, ఆ క్షణం తనంటే ఇష్టం లేని వారి కోసం తాను ఇంతలా ఎందుకు అయిపోవాలనిపించింది ఆ క్షణమే తాను నేరుగా గుడికి వెళ్లి అక్కడ కాసేపు కూర్చొని ఏడ్చేసాను , ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయి అన్నిటినీ వదిలేసి పూర్తిగా మారిపోయానట్టు తెలిపారు. కానీ ఇంతకు హరిని మోసం చేసిన అమ్మాయి ఎవరనే విషయం మాత్రం బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: