హర్యానా రాష్ట్రం హిసార్‌లో ఉన్న 'ఓమ్ స్టెర్లింగ్ గ్లోబల్' యూనివర్సిటీ (ఓఎఎస్‌జీయూ) ఉన్నత విద్యా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. ఆధునిక సౌకర్యాలు, విశాలమైన 100 ఎకరాల క్యాంపస్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన కోర్సులతో ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులకు విస్తృత అవకాశాలను అందిస్తోంది. ఈ యూనివర్సిటీకి భారత ప్రభుత్వం, యూజీసీ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వంటి ప్రముఖ సంస్థల నుంచి అనుమతులు లభించాయి. విద్యా ప్రమాణాల పరంగా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా.. ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై కూడా ఈ యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి పెడుతోంది.

విద్యార్థుల కెరీర్ అభివృద్ధి కోసం ఓఎఎస్‌జీయూ యూనివర్సిటీ దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు కలిగి ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలతో కలసి పనిచేస్తూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తోంది. దీంతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. ఈ యూనివర్సిటీలో 190కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 14 స్కూల్స్ ద్వారా వివిధ విభాగాల్లో విద్యను అందిస్తున్నారు. 12,000కు పైగా విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటుండగా.. 120కు పైగా ఇండస్ట్రియల్ పార్ట్‌నర్స్ ఉన్నారు. ప్లేస్‌మెంట్ పరంగా 84% అడ్మిషన్ రేట్‌తో మంచి ఫలితాలను సాధిస్తోంది.

విద్యార్థులకు 100% ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్, 250కి పైగా రిక్రూటర్స్, 170కి పైగా మల్టీనేషనల్ కంపెనీలతో అనుబంధం ఉండడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. అంతేకాకుండా 34కి పైగా ఫార్చ్యూన్ కంపెనీలు, 30కి పైగా హై ప్యాకేజ్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో చదవాలనే లక్ష్యంతో ఉండే విద్యార్థులకు కూడా ప్రత్యేక మార్గదర్శకాలు అందిస్తున్న ఈ యూనివర్సిటీ.. కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు మార్గం చూపుతోంది. మొత్తంగా ఆధునిక విద్యా సదుపాయాలు, పరిశ్రమ అనుసంధానం, మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు కలగలిపిన ఓఎఎస్‌జీయూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: