వరల్డ్ బిగ్గెస్ట్ తెలుగు సింగింగ్ రియాలిటీ షో - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 షో కీలక దశకు చేరుకుంది. 37 దేశాలలో 15000+ ఆడిషన్స్ లో 100 మందికి పైగా అద్భుతమైన గాయకులకు జడ్జస్  - థమన్, కార్తీక్,  గీతా మాధురి ముందు ఆడిషన్‌కు అవకాశం లభించింది. 2 వారాల పాటు సాగిన నాలుగు ఎపిసోడ్‌ల ఆడిషన్‌లు - ఎక్స్‌ట్రార్డినరీ సింగింగ్, మల్టీ టాలెంటెడ్ సింగర్‌లు, వారి కలలను నెరవేర్చుకోవడానికి వచ్చిన కొన్ని ఎమోషనల్ స్టోరీస్ మనసుని హత్తుకున్నాయి.

ఈ షో హిస్టరీ లో తొలిసారి - నేరుగా టాప్ 12కి అర్హత సాధించిన 6 గోల్డెన్ మైక్‌లు అందుకున్నారు. గోల్డెన్ టిక్కెట్ల విజేతలలో థియేటర్ రౌండ్ ఆడిషన్‌లు నిర్వహించబడ్డాయి. మిగిలిన టాప్ 12 కంటెస్టెంట్స్ ఎంపిక చేశారు.

జూన్ 28 నుండి ఈ టాప్ 12 కంటెస్టెంట్స్  తెలుగు ఇండియన్ ఐడల్ విజేత టైటిల్ కోసం పోటీపడతారు. ప్రేక్షకుల ఓటింగ్,  న్యాయమూర్తుల తీర్పు ఆధారంగా విజేతని ఎంపిక చేస్తారు.

టాప్ 12 కంటెస్టెంట్స్:

స్కంద - హైదరాబాద్‌కు చెందిన స్కంద నాలుగేళ్ల వయసులో తన తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అతని తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తల్లితండ్రులిద్దరూ స్కంద అభిరుచిని ప్రోత్సహించారు. తల్లి చాలా సపోర్ట్ చేసింది. సంద్క తన ఆడిషన్ పెర్ఫార్మెన్స్ ని తన తల్లికి అంకితం చేశాడు.

వల్లభ -  వల్లభది నంద్యాల. తన కొడుకు ఆశయాల కోసం చాలా త్యాగాలు చేసిన వల్లభ తండ్రి కొడుకు కల కోసం హైదరాబాద్‌కు మారారు.

అనిరుధ్ - తెలుగు, తమిళం రెండింటిలోనూ అనుభవజ్ఞుడైన నేపథ్య గాయకుడు,  "చావు కబురు చల్లగా" చిత్రంతో పాటు కొన్ని తమిళ పాటలు పాడారు. అతను మరింత గుర్తింపు పొందేందుకు ఈ వేదికలోకి వచ్చారు. తనది  హైదరాబాద్‌.

కీర్తన - హైదరాబాద్‌కు చెందిన 14ఏళ్ళ కీర్తన రెండేళ్లుగా పాటలు పాడుతూ "సూపర్ సింగర్ జూనియర్"లో పోటీ పడింది.

శ్రీ కీర్తి - "సూపర్ సింగర్ జూనియర్" చివరి సీజన్‌లో 16 ఏళ్ల ఫార్మర్ కంటెస్టెంట్,అమెది  హైదరాబాద్‌.

హరిప్రియ - హరిప్రియ తల్లి సంగీతం నేర్పిస్తూ జీవనోపాధి పొందుతుండగా, ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టారు. తల్లిని సంతోషంగా ఉంచడమే ఆమె ప్రధాన లక్ష్యం. తను హైదరాబాది.  

కేశవ్ రామ్ - మెల్ బోర్న్ కు చెందిన కేశవ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. అతను సంగీతంలో ఓదార్పుని పొందుతాడు. భారతదేశంలో సంగీతకారుడిగా మారాలని తన ఆకాంక్ష. అతను మాండలిన్  వాయిస్తాడు.

రజినేష్ పూర్ణిమ - "పాడుతా తీయగా 2021"లో పోటీదారు, రజనీష్ గాయకుల కుటుంబం నుండి వచ్చారు. హైదరబాది

నజీరుద్దీన్ షేక్ - మహారాష్ట్రలోని చాలా వెనుకబడిన తరగతి రైతుల కుటుంబం నుండి వచ్చిన నజీరుద్దీన్ వివిధ వనరుల నుండి సంగీతం నేర్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్‌లో పోటీ పడుతున్నాడు.

కుశాల్ శర్మ -

భరత్ రాజ్ - నిజామాబాద్ నుంచి నేపథ్య గాయకుడు, భరత్ రాజ్ కూడా సరిగమప, లాంటి  ఇతర షోలలో పాల్గొన్నారు.

శ్రీ దృతి - గతంలో షో కి ఎంపికైనప్పటికీ, తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీ ద్రుతి పాల్గొనలేకపోయింది. తన కలను సాధించి, టాప్ పెర్ఫార్మర్ కావాలనే తన తండ్రి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్న ఆమె ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్‌లో చేరింది.

గోల్డెన్ మైక్ అందుకున్న పోటీదారులు నేరుగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. గోల్డెన్ టికెట్ పొందిన వారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో చోటు కోసం న్యాయనిర్ణేతల ఆమోదం పొందడానికి మళ్లీ ప్రదర్శన ఇవ్వాలి.

గోల్డెన్ మైక్:
1. స్కంద
2. హరిప్రియ
3. శ్రీ కీర్తి
4. కేశవ్ రామ్
5. సాయి వల్లభ
6. అనిరుధ్ సుస్వరం

గోల్డెన్ టికెట్:
1. ఎల్ కీర్తన
2. భరత్ రాజ్
3. రజనీ శ్రీ పూర్ణిమ
4. నజీరుద్దీన్ షేక్
5. ఖుషాల్ శర్మ
6. శ్రీ ధృతి

'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 'ఆహా'లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: