
కానీ ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు పిల్లలతో స్నాక్ షేరింగ్ లాంటివి చేస్తూ ఉంటారు . ఒక పిల్లాడికి జలుబు ఉంటే ఆ పిల్లాడి దగ్గర కుర్చుంటే మన పిల్లాడికి జలుబు వచ్చేస్తుందేమో అని భయపడి పోతూ ఉంటారు తల్లిదండ్రులు . అలాంటి సందర్భాలు కూడా చాలానే చూస్తుంటాం. అయితే ఇవన్నీ తప్పించుకోవాలి అంటే పిల్లలకి కొన్ని కొన్ని పద్ధతులు నేర్పించాలి . మరీ ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలకు కచ్చితంగా హ్యాండ్ కర్చీఫ్ అనేది మర్చిపోకుండా ప్రతిరోజు క్లీన్ చేసి పెట్టాలి.
అదేవిధంగా స్నాక్ బాక్స్ కూడా నీట్ గా క్లీన్ చేసి హల్దీ స్నాక్స్ ని పెట్టాలి. ఫ్రూట్స్ అండ్ నట్స్ ఎక్కువగా పిల్లలు తినే విధంగా చూసుకోవాలి . అంతేకాదు పిల్లలు ఏది తినే ముందైనా సరే హ్యాండ్ వాష్ చేసుకునే పద్ధతి అలవాటు చేయాలి. పిల్లలు స్నాక్స్ షేర్ చేసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు హాలిడేస్ కాబట్టి ఏ సమయానికి అంటే ఆ సమయానికి లేస్తూ ఉంటారు ఫుడ్ ఇంట్లోనే నిదానంగా తింటూ ఉంటారు. కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యింది.
8:30 అయ్యేసరికి స్కూల్లో ఉండాలి . పిల్లలు పొద్దు పొద్దున్నే సరిగ్గా నిద్ర లేవలేక పోవచ్చు ఇబ్బంది పడొచ్చు . ఆ కారణంగానే రాత్రి త్వరగా పడుకోబెట్టి ఉదయం పూట నిద్రలేపి చక్కగా రెడీ చేసే స్కూల్ కి పంపించడం ఒక మంచి హ్యాబిట్ గా మారుతుంది. ఫుడ్ టైమింగ్స్ కూడా పూర్తిగా మారిపోతాయి . కాబట్టి పిల్లలకి ఇప్పటినుంచే కొన్ని కొన్ని పద్ధతులు అలవాటు చేయడం మంచిది. మరి ముఖ్యంగా వాళ్ళకి చదువుపై ఇంట్రెస్ట్ వచ్చేందుకు రకరకాలుగా యాక్టివిటీల పేరుతో మనమే ఇంట్లో ఏదైనా పిల్లలకి నేర్పించే విధంగా గేమ్స్ ప్లాన్ చేసుకోవడం మరింత ఉత్తమం.
పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి కొంతమంది ఏడుస్తూ ఉంటారు . అలా ఏడవకుండా మారం చేయకుండా ఉండడానికి వాళ్లకి స్కూల్ కి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించే విధంగా చేయాలి . స్కూల్లో అలా ఆటలాడిస్తారు ఈ విధంగా ఫ్రెండ్స్ ఉంటారు అని వాళ్ళకి స్కూల్ కి వెళ్లడానికి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా చేయాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ స్కూల్లో ఏం జరిగింది ..? ఏం చెప్పారు..? ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు..? ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే పిల్లలు కచ్చితంగా స్కూల్ కి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . అంతేకాదు హాయిగా స్క్రీన్ టైమ్ తగ్గించి మనతో మాట్లాడుతూ ఉంటారు . ఖచ్చితంగా పిల్లల విషయంలో పేరెంట్స్ ఈ టిప్స్ ఫాలో అయితే వాళ్ల హెల్త్ కి వాళ్ళ ఫ్యూచర్ కి రెండిటికి మంచిదే..!!