ఇది ప్రతి ఒక్కరు తమ లైఫ్ లో  ఫేస్ చేసే ఉంటారు . ఎవరైనా సరే మగవారు మంగళవారం గడ్డం షేవ్ చేయించుకోవాలి అన్న.. కటింగ్ చేయించుకోవాలి అన్న ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు.  ఇవాళ మంగళవారం చేయకూడదు మంచిది కాదు అంటూ అడ్డుపడుతూనే ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది ఎంప్లాయిస్ కి ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉన్న ..లా ఫార్మల్ లుక్స్ లో కనిపించడానికి గడ్డం క్లీన్ చేసుకునే దానికి అస్సలు ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు . మనలో  ప్రతి ఒక్కరూ ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేసే ఉంటారు. అయితే ఎందుకు మంగళవారం ఎందుకు షేవ్ చేయకూదదు..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


మంగళవారం నాడు జుట్టూ కత్తించుకోఖుడదు, షేవ్ చేయకూడదు, గుండు కొట్టించుకోఖుడదు, గోళ్ళు కత్తిరించకూడదని కొందరు నమ్ముతారు.  ఎందుకంటే ఇది అంగారక గ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి. అలా చేస్తే అంగారకుడు కోపం వస్తుందట.  అంగారకుడు కోపం మరియు కలహాలకు కారకుడిగా భావిస్తారు. మంగళవారం నాడు జుట్టూ కత్తించుకోఖుడదు, షేవ్ చేయకూడదు, గుండు కొట్టించుకోఖుడదు, గోళ్ళు  కత్తిరించడం వల్ల అశుభం కలుగుతుందని.. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, దురదృష్టం కలుగుతుందని కొందరు ఎక్కువుగా నమ్ముతారు. మరికొందరు మంగళవారం గోళ్ళు కత్తిరించడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని నమ్ముతారు. అలాగే, మంగళవారం హనుమంతుడికి సంబంధించిన రోజు  కాబట్టి ఈ రోజున గోళ్ళు, జుట్టు కత్తిరించకూడదు అని కూడా పెద్ద వాళ్ళు చెబుతుంటారు.



హిందూ మతం ప్రకారం..ప్రతి రోజు ఒక నిర్దిష్ట గ్రహానికి లేదా దేవునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఆ కారణంగానే  మంగళవారం అంగారక గ్రహానికి చెందినది కాబట్టి ..ఈ గ్రహం భూమిపై నివసించే వారికి ముఖ్యమైన ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అంగారకుడు ధైర్యానికి, కోపానికి మరియు కలహాలకు కారకుడిగా భావించబడతాడు.  ఆ కారణంగానే మగళవారం అ మంగళమైన పనులు చేయకూడదు అని ఇంట్లో ని పెద్ద వారు చెబుతుంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: