కాలి పగుళ్లను వేగంగా తగ్గించుకోవడానికి కొన్ని సులువైన ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. కొద్దిగా పసుపు, వేప ఆకుల్ని కలిపి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను పగుళ్లున్న చోట రాయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు.

 రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత, కొద్దిగా పెట్రోలియం జెల్లీ, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పగుళ్లపై రాయాలి. నిమ్మరసం సహజంగా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. జెల్లీ తేమను లాక్ చేస్తుంది. రాత్రంతా ఉంచి, ఉదయం కడిగేస్తే, తేడా మీరే గమనిస్తారు. ఒక చిన్న బకెట్లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కాస్త ఉప్పు కలపండి. అందులో మీ పాదాలను 15-20 నిమిషాలు ఉంచండి. ఇది పాదాల చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తర్వాత ప్యూమిస్ స్టోన్తో  రుద్దడం ద్వారా డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించవచ్చు.

తేనెలో యాంటీబయోటిక్ గుణాలున్నాయి. కొద్దిగా పాలను తీసుకుని అందులో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి కొంతసేపు మసాజ్ చేయండి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. అరటి పండు, అవోకాడోను కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను పగుళ్లపై రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే, పాదాలు మృదువుగా మారతాయి.

ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడుక్కొని  రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాయాలి.  ఎక్కువ సమయం బూట్లు ధరించడం  మానుకోవాలి.  ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, కొద్ది రోజుల్లోనే పగుళ్లు తగ్గిపోయి మీ పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: